మన దేశంలో ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఒకటి. భారత దేశ పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ కార్డును జారీ చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న మోసాలకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్తగా ఆధార్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఆధార్ కార్డును ఎలా ధృవీకరించాలో ట్వీట్ చేసింది. మిగతా వివరాల కోసం uidai.gov.in ఆధార్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ చేయవచ్చు అని పేర్కొంది.
“ఏదైనా ఆధార్ కార్డును ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా ధృవీకరించవచ్చు. ఆఫ్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు #Aadhaarపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఆన్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, లింక్(link: https://resident.uidai.gov.in/verify)లో 12 అంకెల ఆధార్ నమోదు చేయండి, అలాగే ఎమ్ఆధార్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు” అని ట్విటర్ లో పేర్కొంది.
నకిలీ ఆధార్ కార్డులను గుర్తించండి ఇలా?
- మొదట resident.uidai.gov.in/verify లింకు మీద క్లిక్ చేయండి.
- తర్వాత ఆధార్ నెంబరు, కాప్చాను నమోదు చేయాలి.
- ఇప్పుడు ‘Proceed to Verify’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
అన్నీ నమోదు చేశాక మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే, మీ వయస్సు, జెండర్, రాష్ట్రం, మొబైల్ నెంబర్ వివరాలు పాక్షికంగా కనిపిస్తాయి. ఒకవేల అది నకిలీది అయితే ఇలాంటి వివరాలు ఏమి కనిపించవు. పైన పేర్కొన్న పద్దతులు ద్వారా మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా అనేది తెలుసుకోవచ్చు.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.