Sunday, October 13, 2024
HomeHow ToPan Card: మీ పాన్ కార్డు నకిలీదేమో గుర్తించండి ఇలా?

Pan Card: మీ పాన్ కార్డు నకిలీదేమో గుర్తించండి ఇలా?

How to verify pan card details in online: మన దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అంతే మాదిరిగా పాన్ కార్డు చాలా విలువైనది. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర ఆర్ధిక లావాదేవీల కోసం కచ్చితంగా పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఆధార్‌ కార్డు ఉంటే క్షణాల్లో ఈ-పాన్ కార్డులను జారీ చేస్తుంది.

మీరు ఈ పాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే కొందరు మోసాగాళ్లు కొత్త టెక్నాలజీ సహాయంతో పాన్ కార్డ్ విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. అలాగే, మన పాన్ కార్డు స్టేటస్ గురుంచి ఇప్పుడు తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలానో తెలుసుకుందాం..

నకిలీ పాన్ కార్డు గుర్తించడం ఎలా..?

మొదట ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.

పోర్టల్ లో Our Service విభాగంలో ‘Verify Your PAN’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేసి ‘Continue’ మీద క్లిక్ చేయాలి.

- Advertisement -

ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేసి “Validate”పై నొక్కాలి.

ఇప్పుడు ఆ పాన్ కార్డు సరైనది అయితే, “PAN is Active and details are as per PAN” అనే మెసేజ్ వస్తుంది. ఇలా వస్తే పాన్ కార్డు ఒరిజినల్ అని అర్ధం లేకపోతే నకిలిదీ అని గుర్తుంచుకోవాలి. పైన చెప్పిన విధంగా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన పేరు మీదనే నకిలీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles