ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను చెరవేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బియ్యం, వస్తువులను ఇంటికి తీసుకెళ్లేందుకు మినీ ట్రక్కులను కొనుగోలు చేయడం ద్వారా లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ప్రత్యేక హోమ్ డెలివరీ వాహనాలను ఈ నెల 3వ ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు. ఈ విషయంపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత నెల 4న అధికారులు మినీ ట్రక్కులను పొందడానికి జిల్లా వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు.

ఇంకా చదవండి: వైయస్ఆర్ రైతు భరోసా డబ్బులు పడకపోతే ఇలా చేయండి!

దాన్యం సేకరించిన తర్వాత గతలో చెప్పినట్లుగా 15 రోజులలో పేమెంట్లు జరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి సంబందించిన బకాయలను రైతులకు సంక్రాంతిలోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ వారంలో డోర్‌ డెలివరీ వాహనాలు ప్రారంభించి.. అదే రోజున 10 కిలోల రైస్‌ బ్యాగ్స్‌ కూడా ప్రారంభిచనున్నారు. వచ్చే నెల 1 నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ చేయనున్నారు. మొత్తం 9260 మొబైల్ యూనిట్లు.. అదే సంఖ్యలో తూకం యంత్రాలను, 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు కూడా సిద్దం చేశారు. 9260 మొబైల్ యూనిట్లలో 3,800 మంది బీసీలు, 1,800 మంది ఇబిసిలు, 2,300 మంది ఎస్సీలు, 700 మంది ఎస్టీలు, 556 మంది ముస్లిం మైనారిటీలు, 104 మంది క్రైస్తవ మైనారిటీలు కలిగి ఉన్నారు. ఈ వాహనాలు కొనుగోలులో లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ లభించగా 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటా ఉండనుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని  Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here