ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మొబైల్ లో ఫేస్‌బుక్ ఉంటుంది అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా విస్తరించిది ఈ సోషల్ మీడియా దిగ్గజం, మనకు దీని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంత కంటే ఎక్కువ చెడు కూడా జరుగుతుంది. అందుకే పొలిసులు కూడా సోషల్ మీడియా వాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మనం అప్లోడు చేసే ప్రతి ఫోటోను ఎంతో మంది దానిని వివిద రకాలుగా ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగే అవకాశం ఎక్కువ అని వారు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి: అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన షియోమీ ఎంఐ 10ఐ

అందుకే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫేస్‌బుక్ కొత్తగా ప్రొఫైల్ లాక్ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ కొత్త ఫీచర్‌తో దేశంలోని ఫేస్‌బుక్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా కేవలం మన ఫ్రెండ్స్ జాబితాలోని వ్యక్తులు మాత్రమే మీ ఫోటో, స్టేటస్, పోస్టులను చూసే అవకాశం ఉంది. దీంతో చాలా వరకు ఇతర సమస్యల నుండి తప్పించుకోవచ్చని తెలిపింది. అలాగే మనకు పరిచయం లేని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు ఎప్పుడు అనుమతి ఇవ్వొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీరు కూడా ఒక్క నిమిషంలో మీ ప్రొఫైల్ కు లాక్ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ప్రొఫైల్ లాక్ చేయండి ఇలా..

  • మొదట మీరు గూగుల్ ప్లే స్టోర్/ఆపిల్ యాప్ స్టోర్‌కు వెళ్లి మీ ఫేస్‌బుక్ యాప్ ను అప్‌డేట్ చేసుకోండి.
  • తరువాత మీ ప్రొఫైల్ పేజీని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీ ప్రొఫైల్ పేరులో యాడ్ స్టోరీ పక్కన కనిపించే ‘మోర్’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో కనిపించే ‘లాక్ ప్రొఫైల్’ ఆప్షన్ ను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీ స్క్రీన్‌పై కనిపించే “Lock Your profile” అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడ మీకు మీ ప్రొఫైల్‌ లాక్ అయినట్లు మెసేజ్ కనిపిస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here