Friday, April 26, 2024
HomeGovernmentAndhra Pradeshవైయస్ఆర్ రైతు భరోసా డబ్బులు పడకపోతే ఇలా చేయండి!

వైయస్ఆర్ రైతు భరోసా డబ్బులు పడకపోతే ఇలా చేయండి!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రైతుల అకౌంట్లోకి వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలను వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయం కింద 3 విడతాలలో నగదును జమ చేస్తుంది. అయితే ఈ ఏడాది కూడా 2020 -2021కి సంబందించిన రెండు విడతల్లో నగదును తొలి విడతగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో అంటే ఈ ఏడాది మే 15న సాయం అందించింది. రెండో విడత నగదును అక్టోబర్ 27న జమ చేసింది. తాజాగా మూడో విడత కింద రూ.1,120 కోట్లను డిసెంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి జమ చేసింది. దీంతో పాటు అక్టోబర్ లో వచ్చిన నివర్‌ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద రూ. 646 కోట్లను జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇంకా చదవండి: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేడు ఖాతాల్లోకి నగదు జమ!

రైతు భరోసా కింద రూ.1,766 కోట్లు, నివర్‌ తుఫాను బాధితులకు రూ. 646 కోట్లను మంగళవారం(డిసెంబర్ 29న) రైతుల అకౌంట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సంధర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతుబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి రైతు పక్షపాత విధానాలు తెచ్చిన ప్రభుత్వం మనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 3వ విడత రైతుభరోసా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు, మొత్తంగా రూ. 1,766 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని సీఎం వైయస్ జగన్ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా పంట నష్టపరిహారం, సంక్రాంతికి ముందే రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు.

వైయస్ఆర్ రైతు భరోసా స్టేటస్

వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ 3వ విడత నిధులు పొందటానికి అర్హులైన జాబితా కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్ లింక్‌ క్లిక్ చేసి చూడండి. అందులో Beneficiary List అనే దానిపై క్లిక్ చేసి మీ జిల్లా, మండలం, గ్రామం పేరు ఎంటర్ చేసి చూస్తే మీకు అక్కడ ఈ నిధులు పొందటానికి అర్హులైన జాబితా కనిపిస్తుంది. ఒక వేల మీపేరు లేకపోతే రైతు భరోసాకు సంబంధించిన 155251 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేల అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే రైతు భరోసా స్టేటస్ వెబ్‌సైట్ లింకుపై క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపించే Know your RythuBharosa Status పై క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూడండి. ఒకవేల మీకు డబ్బులు పడక పోతే మీ గ్రామంలోని గ్రామ సచివాలయ అధికారులు లేదా రైతు భరోసా 155251 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని  Subscribe చేసుకోండి.

- Advertisement -

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles