Wednesday, October 16, 2024
HomeGovernmentఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా!

ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా!

పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని జమ చేసే ప్రక్రియను ఆరు కోట్ల మంది సభ్యులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ప్రారంభించింది. 8.5 శాతం వడ్డీ చొప్పున ఈపీఎఫ్‌ ఖాతాలో వేసే ప్రక్రియను గురువారం మొదలుపెట్టింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లోని సభ్యులు 2019-20 సంవత్సరానికి జమ చేసిన 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్‌వో ఖాతాలో చెక్ చేసుకోవచ్చు అని తెలిపింది. 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్‌వోకు జమచేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు పంపించిందని, గత ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఖాతాలో కూడా వడ్డీని జమ చేయడం ప్రారంభించిందని అధికారి తెలిపారు.

ఇంకా చదవండి: వైయస్ఆర్ రైతు భరోసా డబ్బులు పడకపోతే ఇలా చేయండి!

లేబర్ మినిస్టర్ సంతోష్ గంగ్వార్ మాట్లాడుతూ, “2019-20 సంవత్సరానికి చెందిన ఇపిఎఫ్ పై 8.5 శాతం వడ్డీ రేటును జమ ప్రారంభించాం. 2019-20 సంవత్సరానికి ఇపిఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ రేటును అందించాలని నోటిఫికేషన్ జారీ చేశాం. డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తున్న సభ్యులందరికీ 8.5 శాతం వడ్డీ రేటు (2019-20 సంవత్సరానికి) తప్పకుండా అందేలా చూడాలని కోరినట్లు” మంత్రి చెప్పారు. గత ఆర్దిక సంవత్సరానికి చెందిన వడ్డీని రెండు విడతల్లో జమ చేయాలని తొలుత నిర్ణయంచామని.. కానీ తర్వాత ఏకమొత్తంలో జమ చేయాలని కార్మిక శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ను ఇంటి నుండే నాలుగు వేర్వేరు మార్గాలలో ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు అని ఈపీఎఫ్‌వో సంస్థ ట్విటర్ లో ట్వీట్ చేసింది.

ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

ఈపీఎఫ్‌వో పోర్టల్‌:

  • epfindia.gov.in కు పోర్టల్ ఓపెన్ చేయండి.
  • మీ UAN నంబర్, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి.
  • ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.
  • మీరు అన్ని వివరాలను సమర్పించిన తర్వాత, మీరు క్రొత్త పేజీలో అడుగుపెడతారు.
  • ఇప్పుడు మెంబర్ ఐడిని తెరవండి
  • ఇప్పుడు మీరు మొత్తం మీ ఖాతాలోని బ్యాలెన్స్ చూడవచ్చు.

ఉమాంగ్‌ యాప్‌:

  • ఉమాంగ్‌ యాప్ ను ఓపెన్ చేసి ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి
  • మీ యుఎన్ నంబర్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయండి.
  • తర్వాత ఫీడ్ వ్యూ పాస్‌బుక్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటిపీ వస్తుంది.
  • ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేశాక మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

SMS ద్వారా:

UAN పోర్టల్‌లో నమోదు చేసుకున్న సభ్యులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల నుండి SMS పంపడం ద్వారా వారి PF వివరాలను పొందవచ్చు. దీని కోసం, మీరు ‘EPFOHO UAN’ను టైపు చేసి 7738299899కు SMS చేయాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్‌ పంపించాలి.

- Advertisement -

మిస్డ్ కాల్ స‌ర్వీస్‌:

ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత ఓ రింగ్‌ అయి వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో ప్రత్యక్షమవుతాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని  Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles