PM-KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను జమ చేస్తుంది.
ఈ పథకంలో భాగంగా మొదటి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులు ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. (ఇది చదవండి: రైతుబంధు 5 ఏకరాల లోపు రైతులకు ఇస్తే ఖజానాకు రూ.4,500 కోట్లు మిగులు)
పీఎం కిసాన్ పథకంలో చేరని వారు మార్చి 31లోగా నమోదు పేరును పీఎం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. లేకపోతే ఎనిమిదో విడత నగదు కూడా మీ ఖాతాలో జమకావు. ఇంతక ముందే మీ పేరు నమోదు చేసుకుంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్(pmkisan.gov.in)లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్టులో(అర్హుల జాబితా) పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి.
అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
- మొదట మీరు Home (pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి.
- ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
- తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.