గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ కూలలో ఉన్నా పేదలకు విద్య, ఉద్యోగాలలో 10% EWS(ఆర్దికంగా వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఇది అగ్రవర్ణ కూలలో ఉన్నా పేదలకు శుభవార్త లాంటిది. అయితే చాలా మందికి ఈ రిజర్వేషన్ వచ్చిన విషయం కూడా తెలియదు, ఒకవేళ తెలిసిన కూడా ఎలా ధరఖాస్తు చేసుకోవాలో కూడా తెలియదు. అందుకని మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం.

EWS రిజర్వేషన్ కి ఎవరు అర్హులు?

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది(19-01-2019 విడుదల చేసిన జీ. వో No.36039/1/2019-Estt (Res) ప్రకారం ews 10% రిజర్వేషన్ కావాల్సిన అర్హతలు:

  • ఏడాదికి అన్నీ విధాలుగా కలిపి 8 లక్షలకు పైబడి అధాయం ఉండకూడదు
  • 5 ఏకరాల లోపు వ్యవసాయ(మెట్ట+మాగాణి) భూమి ఉండాలి
  • రేసేడెన్షియల్ ఫ్లాట్ 1000 sq ft. లోపు ఉండాలి
  • రేసేడెన్షియల్ ఫ్లాట్ 100 గజాల (sq. yards) లోపు మున్సిపాలిటీ ఉండాలి
  • రేసేడెన్షియల్ ఫ్లాట్ 200 గజాల (sq. yards) లోపు నాన్ మున్సిపాలిటీలో ఉండాలి

పైన తెలిపబడిన అర్హతలు మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ews కు ధరఖాస్తు చేసుకోవచ్చు.

EWS రిజర్వేషన్ కు ధరఖాస్తు చేయు విధానం:

మొదట మీరు పైన తెలిపబడిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నట్లయితే ఆధాయ దృవీకణ పత్రం కు ధరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మొదటి సారి ధరఖాస్తు చేస్తున్నట్లయితే మీ దగ్గరలోని లాయర్ నుండి ఆఫిడవిట్ ను తీసుకోండి. Ews రిజర్వేషన్ ధరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

  • ఆధాయ దృవీకరణ పత్రం
  • అప్లికేషన్ ఫామ్
  • ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో(JGEG Format)
  • రేషన్ కార్డ్ /ఆధార్ కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ (PDF Format)
  • మీ తండ్రి / సంరక్షకుడి సంతకం(JGEG Format)
  • మీ సంతకం (JGEG Format)

మీరు పైన తెలిపిన అన్నీ పత్రాలు కలిగి ఉండాలి. మీ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క పేరు, తండ్రి పేరు, మొబైలు నెంబర్, చిరునామా, పుట్టిన తేదీ, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ ఉప కులం కాలలని నింపాలి. మీకు ఎందుకోరకు ఈ దృవ పత్రం అవసరమో తెలియజేయాలి. మీకు ఉండబడిన నగదు, స్థిర, చర ఆస్తుల వివరాలు తెలియజేయాలి.

మన తెలుగు పాఠశాల యూట్యూబ్ చానెల్ లో దీని గురుంచి పూర్తిగా వివరించాను వీక్షించండి

EWS రిజర్వేషన్ కోసం ఆన్లైన్ లో ధరఖాస్తు:

మీరు పైన తెలిపిన అన్నింటినీ సంక్రమంగా పెట్టుకున్న తర్వాత మీ దగ్గరలోని మీ సేవకు వెళ్ళి ధరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో నుండి మీ సేవ పోర్టల్ లోని సిటిజెన్ అకౌంట్ కి లాగిన్ అవ్వాలి. అందులోని ews ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పైన తెలిపిన  పేరు, తండ్రి పేరు, మొబైలు నెంబర్, చిరునామా, పుట్టిన తేదీ, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ ఉప కులం కాలలని నింపాలి. మీకు ఎందుకోరకు ఈ దృవ పత్రం అవసరమో తెలియజేయాలి. మీకు ఉండబడిన నగదు, స్థిర, చర ఆస్తుల వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు అందులో పోస్టల్ అడ్రెస్ కూడా నమోదు చేయాలి. మీరు కనుక పోస్టల్ ఎంచుకున్నట్లయితే మీకు పోస్ట్ ద్వారా దృవ పత్రం ఇంటికి వస్తుంది. పోస్టల్ ఛార్జీలు 45+65=110 రూపాయలు. 

(చదవండి: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు కావడం వలన కొన్ని ప్రభుత్వ సేవలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది )