Saturday, October 12, 2024
HomeGovernmentAndhra PradeshEWS Certificate: ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎవరు అర్హులు..?

EWS Certificate: ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎవరు అర్హులు..?

EWS Reservation Eligibility: విద్య , ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను తీసుకొచ్చింది. అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా విద్య, ఉద్యోగాలలో ఇతర కులాల మాదిరిగానే రిజర్వేషన్లను కల్పించింది.

రెండూ తెలుగు రాష్ట్రాలు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్’ను అమలు చేస్తున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్రాల విద్య, ఉద్యోగాలలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అగ్రవర్ణ పేదలు ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులు.

(ఇది కూడా చదవండి: Caste Certificate: ఏపీ, తెలంగాణలో కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే EWS సర్టిఫికేట్‌ను మీ స్థానిక ఈసేవా/ మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడానికి కొన్ని అర్హతలను నిర్ణయించారు. వీరు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడానికి అర్హులు..

ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ పొందడానికి అర్హులు:

  • కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలలోపు ఉండాలి.
  • ఆ కుటుంబానికి భూమి 5 ఎకరాలకు మించి ఉండకూడదు
  • గృహ విస్తీర్ణం 1000 చదరపు అడుగులలోపు ఉండాలి
  • గ్రామీణ లేక నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఇంటి స్థలం(ప్లాట్‌) 200 గజాల విస్తీర్ణంలోపు ఉండాలి.
  • మున్సిపాలిటీ ఏరియాలో ఇంటి స్థలం(ప్లాట్‌) 100 గజాల విస్తీర్ణంలోపు ఉండాలి.

కుటుంబ ఆదాయం అంటే?

  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థి తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు ఉన్న తొబుట్టువులు, జీవిత భాగస్వామి(భర్త/భార్య), 18 ఏళ్లలోపు ఉన్న సంతానాన్ని కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ అభ్యర్థి కుటుంబంలోని 18 ఏళ్లకు పైబడిన తోబుట్టువులు, సంతానం ఉంటే వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద పరిగణించలేమని కేంద్రం గతంలోనే స్పష్టతనిచ్చింది.
  • పైన ఉన్న నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాయి. 10 శాతం ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలిపితే మొత్తం 60 శాతం వరకు రిజర్వేషన్లు అమలవుతాయి.

ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ దరఖాస్తు విధానం:

  • మొదట మీరు మీ మండల కార్యాలయం నుంచి ఆదాయ దృవీకరణ పత్రం పొందాలి.
  • ఆ తర్వాత లాయర్ నుంచి అఫడివిట్ తీసుకోవాలి.
  • ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ దరఖాస్తు ఫారంలో మీ ఆదాయ వివరాలతో పాటు వ్యక్తిగత, చిరునామా వివరాలు నమోదు చేయాలి.
  • ఇప్పుడు మీ ఆదాయ దృవీకరణ పత్రం, లాయర్ అఫడివిట్ జత చేసి ఈసేవా/ మీసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
  • మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తును VRO, RI, Deputy-MRO, MRO పరిశీలిస్తారు.
  • చివరకు మీరు సమర్పించిన వివరాలు సరైనవి అని వారు దృవీకరించిన తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ జారీ చేస్తారు.

(ఇది కూడా చదవండి: ధరణి ప్రొహిబిటెడ్ జాబితాలో పట్టా భూమి పడితే ఏం చేయాలి?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles