Thursday, April 25, 2024
HomeHow Toధరణి నిషేధిత భూముల జాబితాలో మీ పట్టా భూమి పడితే ఏం చేయాలి?

ధరణి నిషేధిత భూముల జాబితాలో మీ పట్టా భూమి పడితే ఏం చేయాలి?

Dharani Prohibited Properties List: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణీ పోర్టల్’ని రైతుల కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. కానీ, కొత్తగా తీసుకొచ్చిన ఈ పోర్టల్ వల్ల రైతుల సమస్యలు తీరక పొగ ఎన్నడూ లేని కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ధరణీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సమస్యల వల్ల కష్ట జీవి తిప్పలు పడుతున్నారు.

ధరణీ తీసుకొచ్చిన తర్వాత తలెత్తిన సమస్యలలో నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టా భూములను చేర్చడం. పట్టా రైతుల భూములు కూడా ధరణీ ప్రొహిబిటెడ్ జాబితాలో పడటంతో సామాన్య రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన భూములను.. అందులో నుంచి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం చివరికి అవకాశం కల్పించింది.

ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. అన్ని ఆధారాలు పరిశీలించి, నిషేధిత ఆస్తుల జాబితాలో నుంచి ఆ పట్టా భూములను తొలిగించనుంది. పోర్టల్‌లో ‘గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్​క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్’ అనే ఆప్షన్’ను గత ఏడాది అందుబాటులోకి తెచ్చింది.

(ఇది కూడా చదవండి: కొత్త/కరెక్షన్ పాన్‌కార్డ్ దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడం ఎలా..?)

2007లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ ల్యాండ్స్ పరిరక్షణకు నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేసింది. ఇలాంటి భూముల రిజిస్ట్రేషన్’ను నిషేధిస్తూ రిజిస్ట్రేషన్ల చట్టంలో 22(ఏ) సెక్షన్‌ను చేర్చింది.

- Advertisement -

ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, అసైన్డ్, సీలింగ్ ల్యాండ్స్ ఉండాల్సిన నిషేధిత భూముల జాబితాలో.. సుమారు 8 లక్షల ఎకరాల పట్టా భూముల సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయని విమర్శలు వస్తున్నాయి. దీంతో పట్టాదారులు తమ భూములను అమ్ముకోలేక.. కుటుంబీకులకు మ్యుటేషన్ చేసుకోలేక తిప్పలు పడుతున్నారు.

బాధితుల్లో ఫ్రీడం ఫైటర్లు, మాజీ సోల్జర్లు, సన్నకారు రైతులు

రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న నిషేధిత భూముల జాబితాలో సుమారు 32 లక్షల ఎకరాల భూములు ఉండగా, అసైన్డ్ భూములే 22 లక్షల ఎకరాల దాకా ఉన్నాయి. ఈ జాబితాలో సీలింగ్ కింద పోను మిగిలిన భూములు, ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు సుమారు 8 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. రూల్స్ ప్రకారం ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను 10 ఏళ్ల తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాలి.

కానీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తొలగించకపోవడం, కలెక్టర్లు NOC ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు తాజా నిర్ణయంతో ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులు సహా దాదాపు 3 లక్షల మందికి ఊరట దక్కనుంది. ధరణి ప్రొహిబిటెడ్ జాబితాలో నుంచి మీ పట్టా భూమిని తొలగించడానికి క్రింద వీడియోలో పేర్కొన్న విధంగా చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles