Wednesday, October 16, 2024
HomeGovernmentUpdate Aadhar: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరుని మార్చుకోవడం ఎలా..?

Update Aadhar: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరుని మార్చుకోవడం ఎలా..?

Update Aadhar: ఆధార్ గుర్తింపు కార్డు విలువ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు చాలా విలువైనది. పుట్టిన చిన్నపిల్లవాడి నుంచి 100 ఏళ్ల వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ మన దేశంలో ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే, ఇలాంటి ముఖ్యమైన కార్డులో ఏదైనా తప్పులుంటే గతంలో సరిచేసుకునే అవకాశం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కరోనా మహమ్మరి తర్వాత ఆధార్ కార్డు తప్పులుంటే సరిచేసే అవకాశాన్ని కల్పించింది.

పేరు, చిరునామా, తండ్రి/భర్త పేరు, ఫోటో, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలను సరిచేసుకోవాలంటే యూఐడీఏఐ పేర్కొన్న పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో ఆధార్‌ మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలి?)

యూఐడీఏఐ పేర్కొన్న వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీలను మార్చాలంటే పాస్ పోర్ట్, పాన్ కార్డు, రేషన్/పీడీఎస్ ఫోటో కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) వంటి ఫోటో గుర్తింపు గల 32 పత్రలలో ఏదైనా ఒక దానిని తీసుకొని మీ దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రానికి లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ మీరు ఒక దరఖాస్తు పత్రంలో మీ పేరు మిగతా వివరాలు నింపాల్సి ఉంటుంది. ఇటువంటి వాటి వివరాల అప్డేట్ కోసం యూఐడీఏఐ రూ.50 రుసుము చార్జ్ చేస్తుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles