ప్రస్తుత ప్రతి చిన్న అవసరానికి ఎక్కువ ఉపయోగించే గుర్తింపు పత్రం ఆధార్ కార్డు. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, ప్రభుత్వ పథకాలు పొందలన్న, ఏవైనా ఇతరత్ర ప్రయోజనాలు కోసం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం కూడా ఆధార్ కార్డును జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెబుతుంది. అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి ఆధార్ వివరాలు వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్ ను ఎవరైనా ఎక్కడైనా ఉపయోగించారో లేదో తెలుసుకొనే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తుంది. ఇప్పుడు అది ఎలా తెలుసుకోవాలో మనం తెలుసుకుందాం.
- ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ https://uidai.gov.in/ వెబ్ సైటులోకి వెళ్లాలి
- My Aadhar సెక్షన్ లోకి వెళ్లి Aadhar Services సెలెక్ట్ చేయాలి
- ఆనంతరం ఆధార్ సర్విస్ సెక్షన్ లో 8వ వరుసలో కనిపించే Aadhaar Authentication HIstoryపై క్లిక్ చేయాలి
- ఇప్పుడు ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి
- ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో ఎంచుకొని, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి
- ఇప్పుడు మీకు ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారో వివరాలు వస్తాయి
- ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు చేయాల్సి ఉంటుంది
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.