Friday, December 6, 2024
HomeGovernmentRythu Bandhu Payment Status: రైతుబంధు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

Rythu Bandhu Payment Status: రైతుబంధు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

Rythu Bandhu Payment Status: పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధు పేరుతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నగదు జమ అవుతోంది. ఈ వానాకాలం సీజన్‌కుగానూ రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు కింద నగదు అందనుంది. అయితే, ఈ నగదు దశలవారీగా రైతుల ఖాతాలో జమ కానుంది.

(ఇది కూడా చదవండి: Rythu Bandhu Scheme: రైతు బంధు పథకానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?)

అర్హుల జాబితా తెలుసుకోండి ఇలా..?

రైతుబంధు అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకునేందుకు.. అధికారిక వెబ్ సైట్‌ కు వెళ్లాలి. హోం పేజీలో రైతు బంధు స్కీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే.. ఆ తరువాతి పేజీలో మీ జిల్లా, మండలం సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోవాలి.

రైతుబంధు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

రైతు బంధు నగదు మీ ఖాతాలో అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.

  1. మొదట తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి.
  2. ఇప్పుడు హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
  3. అనంతరం రైతుబంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి.
  4. ఇప్పుడు స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  5. వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో చూసుకోవచ్చు.

అయితే, పైన పేర్కొన్న విధానం గతంలో పని చేసేది, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని నిలివేసింది. ప్రస్తుతం మీ ఖాతాలో రైతుబంధు నగదు జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles