Sunday, November 3, 2024
HomeGovernmentకొత్తగా ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. సొంత స్థలంలో కొత్త ఇల్లు ఇల్లు కట్టుకునే వారికి ఏకంగా 3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న నాలుగు లక్షల మందికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లను కేటాయిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు.

అలాగే, భూ నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు.

ఇంకా రూ.75 లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. దళిత బంధు కోసం 17700 కోట్లు, ఎస్టీ సంక్షేమం 12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం 5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, శది ముబారక్ లకు 2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు 11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు 12 వేల కోట్లు బడ్జెట్ లో పెడుతున్నట్లు ప్రకటన చేశారు.

(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో వెహికల్ పెండింగ్ చలాన్ చెల్లించడం ఎలా..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles