Friday, April 19, 2024
HomeGovernmentపీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా? లేదా?ఇలా తెలుసుకోండి!

పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా? లేదా?ఇలా తెలుసుకోండి!

పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం 7వ విడత రూ.2000 కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారా? అయితే మీ నిరీక్షణకు సమయం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ అవుతున్నాయి. పీఎం నరేంద్ర మోడీ డిసెంబర్ 25న 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి రూ.18000 కోట్ల నిదులను విడుదల చేశారు. ఒకవేల మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు మెసేజ్ రాకపోతే అప్పుడు మీ పేరు 7వ విడత పీఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి.

పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద డబ్బు పొందడానికి మీ పేరు తప్పనిసరిగా జాబితాలో ఉండాలి. మునుపటి జాబితాలో చాలా మంది వ్యక్తుల పేర్లు చేర్చబడ్డాయి, కానీ ఈ కొత్త జాబితాలో పేరు లేకపోతే పీఎం కిసాన్ సమ్మన్ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌పై ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మీరు హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయవచ్చు. ఒకవేల కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బు ఇప్పటివరకు మీ ఖాతాలోకి రాకపోతే మీరు వెంటనే వ్యవసాయ సంబందిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

7వ విడత జాబితాలో మీ పేరును తనిఖీ చేసుకోండి

  1. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కి వెళ్ళండి.
  2. హోమ్ పేజీలో ఉన్న ఫార్మర్ కార్నర్ లో Beneficiaries List ఓపెన్ చేయండి.
  3. ఇప్పుడు లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ పేరును ఎంటర్ చేయండి.
  4. ఈ వివరాలను నింపిన తరువాత, ‘గెట్ రిపోర్ట్’ పై క్లిక్ చేసి పూర్తి జాబితాను చూడండి.
  5. అలాగే అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి “Beneficiary Status”పై క్లిక్ చేసి ఆధార్, అకౌంట్, ఫోన్ ఏదో ఒకటి సమర్పించి డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles