Saturday, April 20, 2024
HomeTechnologyMobilesప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే!

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే!

ఈ మద్య కాలంలో ఎక్కువగా మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్ లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. శామ్‌సంగ్, షియోమీ, రియల్ మీ, వివో, ఒప్పో, మోటోరోలా వంటి కంపెనీలు ఒక అడుగు ముందుకు వేసి బడ్జెట్ లోనే 5జీ మొబైల్స్ తీసుకువస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు విడుదలైన 5జీ మొబైల్స్ లలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన మొబైల్ వచ్చేసీ ఐఫోన్ 12. పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 5జీ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల మార్కెట్ వాటా నివేదికను విడుదల చేసింది.

ఇంకా చదవండి: 2020 వాట్సప్ లో వచ్చిన టాప్-10 ఫీచర్స్

కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 12 కేవలం రెండు వారాల అమ్మకాలలోనే 16 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. తర్వాత ఐఫోన్ 12 ప్రో 8 శాతం వాటాతో 2వ స్థానంలోను, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ కేవలం 4 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉన్నాయి. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 12 సిరీస్ మోడళ్లను అక్టోబర్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లు విడుదలైన రెండు వారాల్లో వీటికి భారీ డిమాండ్ వచ్చింది. ఈ సేల్ వల్ల 2020 జనవరి నుండి అత్యధికంగా అమ్ముడైన పది 5జీ ఫోన్లలో ఐఫోన్ 12 మొదటి స్థానంలో నిలిచింది. అందువల్లే ఆపిల్ ఈ మైలురాయిని సాధించిందని కౌంటర్ పాయింట్ అభిప్రాయపడింది.

కరోనా కారణంగా మొదటి 2 త్రైమాసికలలో మార్కెట్ ఆశాజనకంగా లేనప్పటికీ 3వ త్రైమాసికంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్టోబర్‌లో విడుదలైనఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రో అమ్మకాలు మార్కెట్ లో మూడింట ఒక వంతు ఉన్నాయని తెలిపింది. 140కి పైగా దేశాలలో ఐఫోన్ 12 విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్‌లో 5 శాతంగా ఉన్నమొబైల్ విక్రయాలు అక్టోబర్‌లో విడుదల వల్ల ఐఫోన్ 12 మొబైల్ మార్కెట్ వాటా 12 శాతానికి పెరిగిందని కౌంటర్ పాయింట్ నివేదిక తెలిపింది. క్యూ4 2020లో ఐఫోన్ 12 సిరీస్ కోసం డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. ప్రపంచంలో అమ్ముడైన అన్ని ఫోన్‌లలో ఐఫోన్ 12 సిరీస్‌కు చెందిన 5జీ ఫోన్‌లు 24 శాతం వాటా ఆక్రమించినట్లు నివేదిక పేర్కొంది.

ఇంకా చదవండి: ట్రెండింగ్: ఫోన్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా

- Advertisement -

టాప్-5జీ మొబైల్స్

ఆపిల్ అక్టోబర్‌లో ఐఫోన్ 12 (₹76,900) సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ₹ 69,900, ఐఫోన్ 12 ప్రో ₹ 1,19,900, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 12 మరియు 12 ప్రో మొదట ప్రీ-ఆర్డర్ల కోసం అక్టోబర్లో కేవలం రెండు వారాలు మాత్రమే అమ్మకానికి ఉన్నప్పటికీ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం 16 శాతం మార్కెట్ వాటాతో ఐఫోన్ 12 ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5జీ ఫోన్‌గా, ఐఫోన్ 12 ప్రో 8 శాతం వాటాతో ఉంది. ఈ జాబితాలో 4 శాతం మార్కెట్ వాటాతో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ 4 3వ స్థానంలో, 3 శాతం వాటాతో హువావే నోవా 7 5జీ, హువావే పి 40 5జీ, ఒప్పో ఎ 72 5జీ , హువావే పి40 ప్రో5జీ తర్వాత స్థానాలలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles