Tuesday, March 19, 2024
HomeGovernmentదేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ కొత్త రూల్‌.. ఇక వారికి చెక్!

దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ కొత్త రూల్‌.. ఇక వారికి చెక్!

Aadhaar Card New Rules: ప్రస్తుతం దేశంలో ప్రతి పౌరిడి గుర్తింపు విషయానికి వచ్చేసరికి ఆధార్ కార్డు కీలక పత్రంగా మారింది. ఆధార్ కార్డు లేకపోతే మన దేశంలో గుర్తింపు లేనట్టుగానే భావిస్తున్నారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) 13 ఏళ్ల కిందట ఈ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది.

అయితే, ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డు విషయంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(DoIT) వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దాదాపు 100 శాతం పూర్తయింది.

అంటే, దేశవ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని, ఇందులో అందరూ వయోజనులేనని DoIT పేర్కొంది. 5 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కొత్త ఆధార్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ఆధార్ కేంద్రాలలో మాత్రమే జరగనుంది. వచ్చే నెల 1 నుంచి ఆధార్ సేవలను బ్యాంకులు, పోస్టాఫీసులతో సహా ఇతర కేంద్రాలలో నిలిపివేయనున్నారు.

ఇక నుంచి కేవలం జిల్లా, బ్లాక్ స్థాయిలో ఎంపిక చేసిన కేంద్రాలలో మాత్రమే ఆధార్ నమోదు సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఈ కేంద్రాలను ఎక్కడ ప్రారంభించాలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. నకిలీ ఆధార్ నమోదుతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతోనే UIDAI ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

UIDAI తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు ఆధార్ తీసుకునే ప్రక్రియ చాలా వరకు కంట్రోల్ అవుతుందని UIDAI భావిస్తోంది. పిల్లల వయసు 5 ఏళ్ల లోపు ఉంటే వారికి వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా చిన్న పిల్లలకు ఆధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles