WhatsApp Edit Message Feature
WhatsApp Edit Message Feature

WhatsApp Edit Message Feature in Telugu: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వాడుతున్న మెసెంజర్​ ‘వాట్సాప్​’​. మిగతా వాటితో పోలిస్తే వాట్సాప్‌లో​ మెసేజ్ చేయడం చాలా సులభం, సురక్షితం. దీనిలో ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ఫీచర్​ ఉండటం వల్ల మన సందేశాలు ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు.

పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ తమ వినియోగదారుల కోసం త్వరలో ‘Edit Message’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. అంటే, ఒకసారి పంపిన మెసేజ్​ను మళ్లీ ఎడిట్​ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.

(ఇది కూడా చదవండి: వాట్సప్‌లో వాయిస్ కాల్ రికార్డ్ చేయడం ఎలా..?)

ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నట్లు వాట్సాప్‌ బీటా ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. త్వరలోనే బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

నిజానికి ఈ ఫీచర్​ను వాట్సాప్​ ఐదేళ్ల క్రితమే పరీక్షించి, ఆ తర్వాత వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. మళ్లీ ఇన్నాళ్లకు అదే ఎడిట్​ మెసేజ్​ బటన్​పై పనిచేస్తోంది. అయితే.. ఎడిట్​ చేసినట్లు అవతలి వ్యక్తికి తెలుస్తుందా అంటే అవకాశమే లేదని చెబుతోంది డబ్ల్యూఏబీటాఇన్ఫో. ప్రస్తుతానికి సాధారణ మెసేజ్​లానే కనిపిస్తుందని పేర్కొంది.

(ఇది కూడా చదవండి: కేజీ మట్టి ఖరీదు ఆరున్నర లక్షల కోట్లు.. ఎక్కడో తెలుసా?)

ఇంకా, వాట్సాప్‌లో ‘Delete For Everyone’ ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీంతో యూజర్స్‌ సెంట్‌ మెసేజ్‌లను డిలిట్‌ చేయవచ్చు. అయితే ‘Edit Message’ ఫీచర్‌తో పూర్తిగా డిలిట్‌ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరం ఉన్న చోట ఎడిట్‌ చేసుకోవచ్చు.