ఇప్పుడు మన దేశంలో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డును కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండు లేకుండా మనం ఎలాంటి ఆర్దిక లావాదేవీలు చేయలేము. ఇపుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రిజిస్ట్రేషన్, ఇతర పథకాలకు కూడా పాన్ కార్డు తప్పనిసరి చేస్తున్నాయి. అందుకే మనం తప్పని సరిగా పాన్ ని కలిగి ఉండటం ముఖ్యం. మీకు ఇంకా ఈ కార్డు లేకపోతే ఇప్పుడు నిమిషాల్లో ఉచితంగా ఈ-పాన్ కార్డు పొందవచ్చు. 10 అంకెల సంఖ్య గల కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. కోవిడ్ కారణంగా పాన్ ను పొందడానికి ప్రజలు కోసం తక్షణ పాన్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది.

ఇంకా చదవండి: ట్రెండింగ్: ఫోన్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 మే 28న ఆధార్ నంబర్ ఆధారిత ఇ-కెవైసిని ఉపయోగించే తక్షణ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) సదుపాయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇన్‌స్టంట్ పాన్ సౌకర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఈ-పాన్ కార్డు ఇవ్వడానికి సుమారు 10 నిమిషాలు పడుతుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ సౌకర్యం కింద ఇప్పటివరకు సుమారు 7 లక్షల పాన్ కార్డులు జారీ చేయబడ్డాయి. పాన్ కార్డు NSDL మరియు UTITSL ద్వారా కూడా జారీ చేయబడుతుంది. కానీ ఈ రెండు సంస్థలు పాన్ కార్డు పొందడానికి కొంత రుసుము వసూలు చేస్తాయి. అదే మీరు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా ఈ కార్డు కోసం దరఖాస్తు చేస్తే, మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ సౌకర్యం మొదటిసారిగా ప్రత్యేకమైన గుర్తింపును పొందాలనుకునే వ్యక్తుల కోసం తీసుకొచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కొద్దీ నిమిషాల్లోనే ఈ – పాన్ ని పొందవచ్చు. పేపర్‌లెస్, ఎలక్ట్రానిక్ పాన్ (ఇ-పాన్) దరఖాస్తుదారులకు వెంటేనే ఉచితంగా ఇవ్వబడుతుంది. పాన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పిడిఎఫ్ ఫార్మాట్‌లో కార్డు లభిస్తుంది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని మీద మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో మొదలైన మీ ముఖ్యమైన సమాచారంతో పాటు QR కోడ్‌ను కలిగి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీకు 15-అంకెల రసీదు సంఖ్య వస్తుంది. మీ కార్డు యొక్క సాఫ్ట్ కాపీ మీ ఇ-మెయిల్ ఐడికి కూడా పంపబడుతుంది.

ఉచితంగా పాన్ కార్డు పొందండి ఇలా

  1. మొదట https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైటుకు వెళ్లండి.
  2. ఇక్కడ మీరు మీ ఎడమ వైపున Instant PAN through Aadhaar అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  3. ఆ తరువాత వచ్చిన క్రొత్త పేజీలో Get New PAN మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ‘I Confirm’ క్లిక్ చేయండి.
  5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి మీ వివరాలు సమర్పిస్తే సరిపోతుంది.

1 COMMENT

Comments are closed.