ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం కిసాన్) కింద 7వ విడుత నిదులు 2000 వేల రూపాయలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ రైతుల అకౌంట్లోకి జమ చేయనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సంధర్భంగా పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు రూ.18 వేల కోట్లను 9 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాలకు బదిలీ చేయనున్నారు. గత వారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రైసన్‌లో జరిగిన `కిసాన్ కళ్యాణ్’ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన పిఎం మోడీ వాజ్‌పేయి జన్మదినోత్సవం సందర్భంగా రైతులకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తామని, కోట్ల మంది రైతులకు మరో విడత పిఎం కిసాన్ పథకం లభిస్తుందని చెప్పారు.
ఇంకా చదవండి: 10 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి ఇలా
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని 2019లో పీఎం మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు సాగు భూమితో ఆదాయ సహాయాన్ని అందించాలని ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద సంవత్సరానికి 6000 రూపాయలు మూడు విడుతలలో 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేయబడతాయి. చిన్న మరియు ఉపాంత రైతుల కుటుంబాలకు మాత్రమే పీఎం కిసాన్ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారు. మీకు డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యాయో లేదో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఒక వేల మెసేజ్ రాకుంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ద్వారా బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పుడు (ఫిబ్రవరి, 2019) దాని ప్రయోజనాలు చిన్న మరియు ఉపాంత రైతుల కుటుంబాలకు మాత్రమే లభించేవి.
పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు కాదు?
పీఎం కిసాన్ నుండి మినహాయించబడిన వారిలో సంస్థాగత భూస్వాములు, రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న రైతు కుటుంబాలు, సేవలందించిన లేదా పదవీ విరమణ చేసిన అధికారులు మరియు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ అండెటేకింగ్స్ మరియు ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి. వైద్యులు, ఇంజనీర్లు మరియు న్యాయవాదులు వంటి నిపుణులు అలాగే నెలకు 10,000 రూపాయలకు పైగా పెన్షన్ ఉన్న రిటైర్డ్ పెన్షనర్లు మరియు గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు కూడా వీటిని పొందడానికి అర్హులు కాదు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.