పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈకేవైసీ(PM Kisan eKYC) గడువు తేదీని పొడగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల చాలా మంది రైతులకు ఊరట కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లేదా పీఎం కిసాన్ పథకం(PM Kisan Scheme) 11 వ విడత నగదును ఈ నెల ప్రారంభంలో కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత నగదును జమ చేసింది.
సిమ్లాలో జరిగిన మెగా ర్యాలీలో 10 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.21,000 కోట్లకు పైగా విడుదల చేశారు. అలాగే, పీఎం కిసాన్ 11వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేయడంతో పాటు ఈకేవైసీ ప్రక్రియ ముగింపు గడువు తేదీని కూడా మరో 2 నెలలు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఈకేవైసీ(PM Kisan eKYC) ప్రక్రియ పూర్తి చేయకపోతే రూ.2 వేలు ఖాతాలో జమ కాదు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
పీఎం కిసాన్ ఈకేవైసీ(PM Kisan eKYC) గడువు పొడిగింపు
గత మే 31న పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు ముగియడంతో పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరల ఇప్పుడు గడువును పొడిగించింది. పీఎం కిసాన్ పోర్టల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. పీఎం కిసాన్ ఈకేవైసీ గడువును 2022 జూలై 31 వరకు పొడిగించారు.
పీఎం కిసాన్ ఈకేవైసీ(PM Kisan eKYC) ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి?
- మొదట పీఎం కిసాన్ https://pmkisan.gov.in/ అధికారిక వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
- ఇప్పుడు, హోమ్ పేజీ కుడి వైపున ఉన్న eKYC ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీరు ఈకేవైసీ పేజీ ఓపెన్ చేసిన తర్వాత, మీ ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత, ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబరును ఎంటర్ చేసి Get Mobile OTP మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే పీఎం కిసాన్ ఈకేవైసీ(PM Kisan eKYC) ప్రక్రియ పూర్తవుతుంది.
- జూలై 31లోగా పీఎం కిసాన్ ఈకేవైసీ(PM Kisan eKYC) ప్రక్రియను పూర్తి చేయకపోతే, పీఎం కిసాన్ వచ్చే విడత నగదును పొందడానికి మీరు అర్హులు కారు.
పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్(PM KISAN Beneficiery Status Check) ఎలా చెక్ చేయాలి?
- మొదట పీఎం కిసాన్ https://pmkisan.gov.in/ అధికారిక వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో గల మీరు ఫార్మర్స్ కార్నర్(Former Corner) అనే ఆప్షన్ కింద ‘బెనిఫిషియరీ స్టేటస్’ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి
- ప్రత్యామ్నాయంగా, మీరు నేరుగా https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్ మీద క్లిక్ చేయవచ్చు.
- బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నంబర్, పీఎం కిసాన్ ఖాతా నంబర్ లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి Get Data మీద క్లిక్ చేయండి.