Telangana Congress 6 Guarantees: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసమే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇప్పుడు ఈ కథనంలో ఆరు గ్యారెంటీల గురుంచి పూర్తిగా తెలుసుకుందాం..
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫారంలో యజమాని పేరు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా వివరాలు నింపాల్సి ఉంటుంది.
మహాలక్ష్మి పథకం: ఈ పథకంలో భాగంగా మహిళల ఖాతాలో రూ.2500 జమ అవ్వడంతో పాటు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నారు. అయితే, ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి
- గ్యాస్ కనెక్షన్ నెంబర్,
- సరఫరా చేస్తున్న కంపెనీ పేరు,
- ఏడాదిలో వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలు నమోదు చేయాలి.
రైతు భరోసా పథకం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏడాది రైతుల ఖాతాలో రూ.15000 జమ చేయడంతో పాటు వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 జమ చేయనున్నారు. అయితే, ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి
- పట్టాదారు పుస్తకం నెంబర్ నమోదు చేయాలి.
- సాగు చేస్తున్న భూమి వివరాలు(విస్తీర్ణం, సర్వే నెంబర్) నమోదు చేయాలి.
- ఉపాది హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.
ఇందిరమ్మ ఇండ్లు పథకం: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద అర్హులైన వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్ధిక సహాయం చేయడంతో పాటు అమరవీరులకు, ఉద్యమకారులకు 250 గజాలలో ఇంటి స్థలం అంధించనున్నారు. అయితే, ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి
- అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, FIR నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ నమోదు చేయాలి.
- ఉద్యమకారులు అయితే FIR నెంబర్, జైలుకు వెళ్ళిన సంవత్సరం, జైలు పేరు, స్థలం, శిక్ష కాలం వివరాలు నమోదు చేయాలి.
గృహ జ్యోతి పథకం: కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది. అయితే, ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి
- మీ గృహ నెలసరి విద్యుత్ వినియోగం యూనిట్ల సంఖ్యతో పాటు మీటర్ కనెక్షన్ నెంబర్ నమోదు చేయాలి.
చేయూత పథకం: కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం కింద వృద్దులకు రూ. 4000 , దివ్యాంగులకు రూ. 6000 పింఛన్ అందించనున్నారు. అయితే, ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నెంబర్ నమోదు చేయాలి.
ఈ ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కచ్చితంగా ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాలి.