TSLPRB SI - Constable Event Dates 2022
TSLPRB SI - Constable Event Dates 2022

Telangana(TS) SI-Constable Events Dates 2022: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించే శారీరక, సామర్థ్య పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ)లను డిసెంబర్‌ 8 నుంచి నిర్వహించనున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది.

డిసెంబర్ 8 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్

ఈ ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహణకు గాను రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ బోర్డు ఎంపిక చేసింది. ఈ మొత్తం ప్రక్రియను 25 రోజుల్లోపు పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. శారీరక సామర్ధ్య పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులు నవంబర్‌ 29, ఉదయం 8గంటల నుంచి డిసెంబర్‌ 3, అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అని బోర్డు సూచించింది. అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే… support@tslprb.inకు మెయిల్ చేయవచ్చని వివరించారు. లేకపోతే ఈ ఫోన్ నెంబర్లను (93937 11110 or 93910 05006) సంప్రదించవచ్చు.