Telangana Cabinet Ministers List 2023: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిత్వ శాఖలను కేటాయించింది. దీనికోసం దిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
అనంతరం మంత్రుల శాఖలపై నేడు(డిసెంబర్ 9న) ప్రకటన చేశారు. హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం తన వద్దే అట్టిపెట్టుకున్నారు.
మంత్రుల కేటాయించిన శాఖల వివరాలివే..
- భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
- తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయం, చేనేత
- జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటకం
- ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాలు
- దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
- పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
- సీతక్క – పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమం
- కొండాసురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
- Advertisement -