New SIM Card Rules Details in Telugu: మన జీవితంలో మొబైల్ ఫోన్ అనేది అతిముఖ్యమైన భాగంగా మారిపోయింది. అది లేకుంటే జీవితం ముందుకు సాగదు అన్నట్టుగా మారింది. సినిమా టికెట్ నుంచి రైల్వే, విమాన టికెట్ దాకా.. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ దాకా.. సమస్త సేవలూ మొబైల్ కేంద్రంగానే సాగుతున్నాయి.
ఇంతటి కీలకమైన మొబైల్లో వినియోగించే సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డు విక్రయాల్లో సేఫ్టీ, సెక్యూరిటీని పెంచడం సహా దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నకిలీ సిమ్ మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ అరికట్ట వేసేందుకు డిసెంబర్ 1, 2023 నుంచి దేశంలో కొత్త SIM కార్డ్ నిబంధనలు తీసుకొస్తుంది.
కస్టమర్లు, డీలర్లు ఈ పని చేయాలి:
- ఒక వ్యక్తి ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని పొందేందుకు అర్హత ఉంటుంది.
- 90 రోజుల వరకు మీ సిమ్ కార్డు వాడకపోతే ఆ తర్వాత ఆ నంబర్ మరొక వ్యక్తికి కేటాయిస్తారు.
- కస్టమర్లు సిమ్ కార్డుల్ని కొనుగోలు చేసే సమయంలో.. ఆధార్ స్కానింగ్ సహా డెమోగ్రాఫీ డేటా సేకరించాలి.
- డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా:
కేంద్రం రూల్స్ విషయంలో చాలా కఠినంగా ఉండబోతోంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి.. జరిమానా, జైలు వంటి కఠిన శిక్షలు వేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేయనుంది. వీరి పోలీస్ వెరిఫికేషన్ బాధ్యత ఆయా టెలికాం ఆపరేటర్లపైనే ఉంటుంది. ఇవి పాటించకపోతే.. రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంటే సిమ్ కార్డులు విక్రయించే షాపులకు వెళ్లి.. ఆయా నెట్‌వర్క్ సంస్థలు కేవైసీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.