తెలంగాణలోని రైతులకు రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme) కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలు గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే వానకాలం సీజన్ నుంచి రైతులకు రూ.15000 పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు. ఎకరానికి రూ. 7500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి మెుత్తం రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
రైతు భరోసా పథకం కీలక వివరాలు
- రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15,000 అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
- ఈ పథకం రాబోయే వర్షాకాలం నుంచి ప్రారంభమవుతుంది.
- గతంలో రైతు బంధు పథకం కింద ఖరీఫ్ మరియు రబీ సీజన్‌లకు రెండు విడతలుగా ఎకరానికి ₹10,000 అందించేవారు. ఈ సాయం 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే పరిమితమైంది. కొత్త పథకం ఈ సహాయాన్ని ఎకరాకు ₹15,000కి పెరగనుంది.
అర్హత & షరతులు
- పంట సాగు అవసరం : పంటలు వేసిన రైతులకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించనున్నారు.
- కౌలు రైతులు : కౌలుదారులు భూమిని లీజుకు తీసుకునే సమయంలో భూ యజమానుల నుంచి అఫిడవిట్‌లను తీసుకోవాల్సి ఉంటుంది.
- Advertisement -