TSLPRB Released SI and Police Constable 2022 Preliminary Exam Results: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్ఎల్‌పిఆర్‌బి) 21 అక్టోబర్, 2022న విడుదల చేసింది.
సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 554 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి: టీఎస్ఎల్‌పిఆర్‌బి
15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న పోలీసు నియామక మండలి పరీక్ష నిర్వహించింది. వాటి ఫలితాలను నేడు 21 అక్టోబర్, 2022న విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణుల జాబితాను బోర్డు వెబ్సైట్ లో పెట్టింది. టీఎస్ఎల్‌పిఆర్‌బి అధికారిక పోర్టల్ సర్వర్ డౌన్ కారణంగా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.