Sunday, October 13, 2024
HomeTechnologyTrain Running Status in Telugu: ట్రైన్ రన్నింగ్ స్టేటస్ 2 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా..?

Train Running Status in Telugu: ట్రైన్ రన్నింగ్ స్టేటస్ 2 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా..?

Train Running Status: మీరు గ్రామం వెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? ట్రైన్ కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురుచూసి చూసి బోర్ కొడుతోందా? అయితే, మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్‌కు రైలు ఎన్ని గంటలకు వస్తుందో సరిగ్గా సమయం తెలిస్తే అందుకు తగ్గట్టుగా మనం జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.

భారతీయ రైల్వే ప్రయాణికులకు ట్రైన్ రన్నింగ్ స్టేటస్(Train Running Status), లైవ్ ట్రైన్ ట్రాక్ (Live Train Track) లాంటి సేవల్ని అందించేందుకు అనేక ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర వెబ్‌సైట్‌లో, యాప్స్ ద్వారా మీ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక్సిగో, రైల్ యాత్రి, గూగుల్‌కు చెందిన వేర్ ఈజ్ మై ట్రైన్(Where is my train) లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ట్రైన్ స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన హీరో తొలి విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?)

ఎన్ని యాప్స్, ప్లాట్‌ఫామ్స్ ఉన్నా వాటి అవసరం లేకుండా గూగుల్ ద్వారా మీ ట్రైన్ స్టేటస్ సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఉంటుంది కాబట్టి ట్రైన్ స్టేటస్ తెలుసుకోవడానికి మరో వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దీని కోసం యాప్ కూడా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి గూగుల్’లో ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి కింద స్టెప్స్ ఫాలో అవండి.

  • మొదట మీరు గూగుల్ సర్చ్ ఓపెన్ చేసి Train Running Status అని నమోదు చేయండి.
  • ఇప్పుడు మీకు కనిపిస్తున్న బాక్స్’లో రైలు పేరు లేదా రైలు నెంబర్ నమోదు చేయండి.
  • ఆ తర్వాత మీకు మీ రైలుకి సంబధించిన లైవ్ ట్రైన్ స్టేటస్(Live Train Status) కనిపిస్తుంది.

గూగుల్ మ్యాప్స్’లో Train Running Status తెలుసుకోండిలా..

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
  • మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ స్టేషన్ పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
  • ఉదాహరణకు మీరు తిరుపతి వెళ్లాలనుకుంటే Tirupati Railway Station అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
  • మ్యాప్‌లో మీకు తిరుపతి రైల్వే స్టేషన్ లొకేషన్ కనిపిస్తుంది.
  • ట్రైన్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
  • మీకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్ల జాబితా కనిపిస్తుంది.
  • ఆ లిస్ట్ నుంచి మీ ట్రైన్ నెంబర్ లేదా రూట్ సెలెక్ట్ చేయాలి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles