Wednesday, October 16, 2024
HomeHow ToEPF Advance For Marriage: పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!

EPF Advance For Marriage: పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!

EPF Advance For Marriage: మనకు ఎప్పుడు ఎలాంటి ఆర్ధిక అవసరాలు వెంటాడుతాయో చెప్పలేము. ఇలాంటి సందర్భంలో ప్రతి ఉద్యోగికి గుర్తుకు వచ్చేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. మనకు కొన్ని క్లిష్ట సమయాలలో ఆర్థిక పరిస్థితులు తలెత్తినప్పుడు ఈపీఎఫ్​ఓ ఖాతాలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది అనే విషయం అతి కొద్ది మాత్రమే తెలుసు.

(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయండి ఇలా..?)

అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ అడ్వాన్స్​లు నాన్-రిఫండబుల్​. కనుక ఈపీఎఫ్​ మెంబర్లు తమ అవసరాలకు అనుగుణంగా.. చాలా జాగ్రత్తగా ఈపీఎఫ్ అడ్వాన్స్​ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోండిలా?

How To Apply For EPF Advance: ఉద్యోగులు ఈపీఎఫ్​ అడ్వాన్స్ కోసం.. ఫారమ్​ 31ని తమ యజమానికి (కంపెనీ యాజమాన్యానికి) సమర్పించాలి. అప్పుడు మీ కంపెనీ లేదా యాజమాన్యం మీ దరఖాస్తును ధ్రువీకరించి.. ఆమోదం కోసం ‘ఈపీఎఫ్​ఓ’కు సమర్పించడం జరుగుతుంది. ఈపీఎఫ్​ఓ కనుక మీ అభ్యర్థనను ఆమోదిస్తే.. అడ్వాన్స్ సొమ్ము మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది.

ఎలాంటి సమయాలలో ఈపీఎఫ్ అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు?

  • ఆరోగ్య అత్యవసర పరిస్థితి(Medical Emergency)
  • విద్య(Education)
  • వివాహం(Marriage)
  • భూమి కొనుగోలు (Land Purchase)
  • గృహాన్ని పునరుద్ధరించడం(Home Renovation)
  • నిరుద్యోగిత(Unemployed)

ఉద్యోగుల ఆరోగ్యం బాగాలేనప్పుడు చికిత్స కోసం, పిల్లల విద్య కోసం, పెళ్లి చేసుకునేటప్పుడు, భూమి కొనుగోలు చేసినప్పుడు, గృహ నిర్మాణం లేదా పునరుద్ధరణ కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు కొన్ని సార్లు జాబ్​ నుంచి తొలగించబడిన లేదా మానేసిన సందర్భాల్లో.. ఆయా వ్యక్తులు తమ ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందడానికి అర్హులు అవుతారు.

- Advertisement -

ఈపీఎఫ్ అడ్వాన్స్​ కోసం కావాల్సిన అర్హతలు, షరతులు?

  • ఉద్యోగులకు పెళ్లి కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ కావాలంటే.. సదరు వ్యక్తి ఈపీఎఫ్​ఓ మెంబర్​గా 7 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది.
  • స్వయంగా ఉద్యోగి వివాహం చేసుకుంటే ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు. ఉద్యోగి కొడుకు లేదా కూతురు పెళ్లి కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఉద్యోగి సోదరుడు లేదా సోదరి మ్యారేజ్ కోసం కూడా అడ్వాన్స్ తీసుకోవచ్చు.
  • వివాహం కోసం, విద్య కోసం 3 సార్లు కంటే మించి ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి వీలుపడదు.
  • ఒక్కో అవసరానికి ఒక్కో నియమం ఉంటుంది.. వాటి గురుంచి మీరు పోర్టల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఎంత ఇస్తారు?

ఈపీఎఫ్​ అకౌంట్​లో ఉద్యోగి కొంత మొత్తం, యాజమాని కొంత మొత్తం సొమ్మును జమ చేస్తారు అనే విషయం మనకు తెలుసు. దీనిలో ఉద్యోగి చెల్లించిన మొత్తం సహా, దానిపై అప్పటి వరకు వచ్చిన వడ్డీలో 50% సొమ్మును.. పెళ్లి కోసం​ అడ్వాన్స్​గా తీసుకోవచ్చు.

Tech-Patashala-Whatsapp-Channel-Image
Tech-Patashala-Whatsapp-Channel-Image
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles