Saturday, November 23, 2024
HomeHow ToDuplicate Pattadar Passbook కోసం ధరణి పోర్టల్‌లో ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?

Duplicate Pattadar Passbook కోసం ధరణి పోర్టల్‌లో ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?

Duplicate Pattadar Passbook: తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు సంబంధించి ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా మారింది. డిజిటల్‌గా ల్యాండ్ రికార్డులను తీసుకురావడంతో పారదర్శకత పెరిగింది.

(ఇది కూడా చదవండి: Cadastral Map: ధరణి పోర్టల్‌లో మీ ఊరి రెవెన్యూ నక్ష(Map) డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?)

ఈ పోర్టల్ ద్వారా మీ పట్టాదార్ పాస్‌బుక్ పోతే కొత్త పట్టాదారు పాస్​బుక్​ కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పట్టాదార్ పాస్‌బుక్ Reprint కోసం ధరణి పోర్టల్‌లో ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?

  • ముందుగా ధరణి పోర్టల్​ అధికారిక వెబ్​సైట్​ https://dharani.telangana.gov.in ను ఓపెన్​ చేయాలి.
  • స్క్రీన్​ మీద ఉన్న Agriculture ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • TM25 Application for duplicate PPBను ఎంపిక చేసుకోవాలి.. ఆ తర్వాత Click Here to Continue పై క్లిక్​ చేయాలి
  • ఆ తర్వాత మీ ధరణి పోర్టల్ లాగిన్ వివరాల ద్వారా లాగిన్ అవ్వాలి.
  • TM25 Application for duplicate PPBను ఎంపిక చేసుకొని పట్టాదార్​ పాస్​బుక్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి.
  • ఇప్పుడు Fetch బటన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబర్, కమ్యూనికేషన్ అడ్రసు నమోదు చేయాలి.
  • ఇప్పుడు మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత కొత్త పట్టాదారు పాస్​బుక్ మీరు నమోదు చేసిన అడ్రసుకు పోస్టల్ ద్వారా వస్తుంది.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles