Wednesday, May 8, 2024
HomeReal EstateLand Mutation: ల్యాండ్ మ్యుటేషన్ అంటే ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Land Mutation: ల్యాండ్ మ్యుటేషన్ అంటే ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Land Mutation: మన రెండూ రాష్ట్రాలలో స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే మనలో చాలా మంది భూమి, ఇల్లు, ఫ్లాట్‌ను కొనేటప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తగిన ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుందని భావిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేల్‌ డీడ్‌ పట్టుకుని తీరిగ్గా ఇంటికి వెళ్లిపోతారు.

కానీ, కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆస్తి తన పేరు మీదకు రికార్డులను మార్చుకోవాల్సి ఉంటుంది అనే విషయం కొద్ది మందికి తెలుసు. ఇందుకోసం గ్రామ పంచాయతీ రికార్డుల్లో, మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ రెవెన్యూ రికార్డుల్లో తన పేరుపై నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మ్యుటేషన్ అంటే ఏమిటి?

మ్యుటేషన్ అంటే రెవిన్యూ రికార్డుల్లో ఒక ఆస్తి టైటిల్ మార్పు అని అర్థం. సూక్ష్మంగా చెప్పాలంటే ఆస్తి పత్రాలపై యజమానుల పేర్ల మార్పు. ఇది అనేక సందర్భాల్లో జరుగుతుంది. కొనుగోలు చేసిన ఆస్తికి తామే నిజమైన వారసులమని తెలియజేయడమే మ్యుటేషన్‌ ముఖ్య ఉద్దేశం.

(ఇది కూడా చదవండి: Land Buying Tips: వ్యవసాయ భూములు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి..?)

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి ప్రతి ప్రభుత్వం దగ్గర ఓక ల్యాండ్‌ రెవెన్యూ(Land Revenue) రికార్డు ఉంటుంది. సామాన్యులకు వారి పెట్టుబడి పెట్టిన అస్తులను సురక్షితంగా కాపాడటానికి ఈ రికార్డులు సహాయపడతాయి. అందుకే ఎవరైనా ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

అప్పుడే ప్రభుత్వం దగ్గర రెవెన్యూ రికార్డులలో అమ్మిన వారి పేరు తొలగించి కొన్న వారి పేరు మీదకు ఆ ఆస్తి అనేది బదిలీ అవుతుంది. ఇలా ఆస్తి అనేది కొత్తగా కొన్న వ్యక్తి పేరు మీదకు బదిలీ అయిన తర్వాత ఎన్కంబరెన్స్‌ సర్టిఫికెట్‌(ఈసీ), ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌,(ఓసీ)లలో వారు కనిపిస్తుంది.

గతంలో అయితే, మ్యుటేషన్‌ ఛార్జీల పేరిట డీడీని వసూలు చేసి సంబంధిత శాఖలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ పంపేది. ఆస్తిని కొనుగోలు చేసినా, వారసత్వంగా పొందినా, బహుమతిగా వచ్చినా, పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా కొనుగోలు చేసిన మ్యుటేషన్‌ అనేది తప్పనిసరి. ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ వారే ఈ మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

(ఇది కూడా చదవండి: భూ పహాణీ, అడంగళ్‌/పహాణీ, ఖాస్రా పహాణీ అంటే ఏమిటి? వాటి కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

భూమి కొన్న తర్వాత కూడా మ్యుటేషన్‌ కాని ఆస్తులున్న వారు వెంటనే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆస్తిని విక్రయించాల్సి వచ్చినప్పుడు మ్యుటేషన్‌ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విద్యుత్‌, నీటి సేవలు వంటి యుటిలిటీల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా ఈ పత్రాలు అవసరం.

మ్యుటేషన్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

మీ దగ్గర ఉండే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మున్సిపల్‌ సంస్థలు ఈ భూ రికార్డులను నిర్వహిస్తాయి. అక్కడే మీరు మీ భూమి లేదా ఇల్లు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూటేషన్ కోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తి విలువలో 0.1 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ల్యాండ్ మ్యుటేషన్ కోసం కావాల్సిన దృవ పత్రాలు?

ధరఖాస్తు సమయంలో సేల్‌ డీడ్‌, స్టాంపు పేపర్‌పై ఈ ఆస్తి తనదే అని ధ్రువీకరిస్తూ స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌, ఆధార్‌ కార్డు, ఆస్తి పన్ను రసీదులు, వీలునామా లేదా వారసత్వ ధ్రువీకరణ పత్రం, ఒక వేళ యజమాని మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెంబర్’కు కాల్ చేయండి => 6302212352

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles