Thursday, April 25, 2024
HomeGovernmentDharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?

Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?

Land Details Search in DHARANI Website in Telugu: భూరికార్డుల ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఈ పోర్టల్‌ అమలులోకి తీసుకొని వచ్చినప్పటి నుంచి ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ధరణిలో రైతుల, భూమి వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని విపక్ష రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

అయితే, ప్రభుత్వం మాత్రం విపక్షాలు చేస్తున్న వాటికి కౌంటర్ ఇస్తూనే ప్రతి రైతు తమ భూమి వివరాలు చెక్ చేసుకోవాలని సూచిస్తుంది. మీకు సంబంధించి ఏదైనా వివరాలు ధరణిలో తప్పుగా పడితే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అయితే తెలంగాణ ధరణి పోర్టల్‌లో మీ భూమి వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా..?

  • ముందుగా మీరు ధరణి అధికారిక పోర్టల్ https://dharani.telangana.gov.in/ ఓపెన్ చేయండి
  • ఓపెన్ అయిన తర్వాత Agriculture ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఎడమ వైపు, క్రింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • మీ భూమి వివరాలు చూసుకోవాలి అనుకొంటే Land Details Search అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి CLICK HERE TO CONTINUE అనే దాని మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీ District, Mandal, Village వివరాలు నమోదు చేసి ఆ తర్వాత మీ భూమి Survey No/ Sub Division No నమోదు చేయండి.
  • అలాగే, సర్వే నెంబర్ ఎంచుకున్న తర్వాత Captcha కోడ్ నమోదు చేసి Fetch మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు వెంటనే మీ భూమి వివరాలు మీకు కనిపిస్తాయి.
  • అయితే, ధరణిలో మీ భూమి వివరాలు తప్పుగా పడితే మీ జిల్లా కలెక్టర్ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పైన పేర్కొన్న విధంగా భూమి వివరాలు చెక్ చేసుకోవచ్చు.

ధరణి పోర్టల్‌లో అందుబాటులో గల ఇతర సేవలు:

  • పౌరులకు స్లాట్ బుకింగ్
  • వ్యవసాయ భూమి రికార్డుల కోసం NRI పోర్టల్
  • మ్యుటేషన్ సేవలు
  • పాస్‌బుక్ లేకుండా NALA కోసం దరఖాస్తు
  • లీజు కోసం దరఖాస్తు
  • అమ్మకం నమోదు
  • విభజన కోసం దరఖాస్తు
  • వారసత్వ నమోదు కోసం దరఖాస్తు
  • NALA కోసం దరఖాస్తు
  • తనఖా నమోదు
  • GPA నమోదు
  • స్లాట్ రద్దు/రీషెడ్యూలింగ్
  • భూమి వివరాల శోధన
  • నిషేధించబడిన భూమి
  • భారం వివరాలు
  • రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు
  • కాడాస్ట్రాల్ పటాలు.

ఇంకా చాలా ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. మిగతా ఆప్షన్ల గురించి వేరొక కథనంలో మనం తెలుసుకుందాం..

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles