EPF Balance Check in Telugu: ఈపీఎఫ్‌లో ఖాతా కలిగిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు(సీబీటీ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. దీంతో ఈపీఎఫ్ చందదారులు తమ పీఎఫ్ ఖాతాల్లో ఉన్న నగదుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటు లభిస్తుంది.
2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ వడ్డీ మీ పీఫ్ ఖాతాల్లో జమ అవుతుంది. అంటే వచ్చే ఏప్రిల్-మే మధ్య కాలంలో ఈ వడ్డీ జమ కానుంది. అయితే, మనం ఈ కథనంలో మీ EPFO ఖాతాల్లో ఎంత నగదు బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి నాలుగు సులభమైన మార్గాలున్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం..
Check EPF Balance In Website: ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
- మీరు మొదట ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు సర్వీసెస్ సెక్షన్‌లో ఉన్న వ్యూ పాస్‌బుక్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీ UAN, పాస్‌వర్డ్‌తో మరలా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే Member IDపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని చెల్లింపు చేసిన మొత్తాలు వడ్డీతో కలిపి కనిపిస్తాయి.
Check EPF Balance In UMANG: ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
- మొదట మీరు ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఆ తర్వాత మీ ఫోన్లో ఈ ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ ఎంచుకోవాలి.
- అనంతరం ‘Employee Centric Services’ అనే ఆప్షన్‌పై మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మీకు కనిపిస్తున్న ‘View Passbook’ ఆప్షన్ మీద నొక్కండి.
- ఆ తర్వాత మీ UAN నంబర్‌ను ఎంటర్ చేస్తే.. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన ‘Login’ ఆప్షన్‌పై మీద క్లిక్ చేయండి.
- ఆపై మీరు EPF బ్యాలెన్స్‌ని చెక్ చేయాలనుకుంటున్న కంపెనీ Member IDని ఎంచుకోవాలి.
- అప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో పాటు మీ పాస్‌బుక్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- దానితో పాటు పాస్‌బుక్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కావాల్సిన డబ్బును విత్ డ్రా కూడా చేసుకోవచ్చు.
మిస్డ్ కాల్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
పీఎఫ్ చందాదారులు 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే మీ ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా, ఆధార్, యూఏఎన్ నంబర్ మీ పీఎఫ్ ఖాతాకి కచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ కాకపోతే మీరు పని చేసే కంపెనీని అడిగి లింక్ చేయించుకోవాలి. దీనికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
ఉద్యోగి యూఏఎన్ నంబర్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. EPFOHO UAN అని ENG ఫార్మాట్లో మీరు మెసేజ్ పంపాల్సి ఉంటుంది UAN అంటే మీ యూఏఎన్ నంబర్. ENG అంటే ఇంగ్లిష్ భాషలో వివరాలు కావాలని అర్థం. ఒకవేళ మీకు తెలుగులో వివరాలు కావాలంటే EPFOHO UAN TEL అని మెసేజ్ పంపాలి. తెలుగులో మీ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. మీ పీఎఫ్ ఖాతాలో మీ చివరి ట్రాన్సాక్షన్‌తో సహా బ్యాలెన్స్ కనిపిస్తుంది.