Download Village Cadastral Maps: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ పోర్టల్ వల్ల కొన్ని సమస్యలకు పరిష్కరం దొరికితే.. అయితే, మరికొన్ని సమస్యలు కొత్తగా వచ్చాయి.
(ఇది కూడా చదవండి: ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)
ఈ కొత్త సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త కొత్త ఆప్షన్లను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా గ్రామ పటం/గ్రామ నక్ష మనం మొబైలులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రెవెన్యూ గ్రామ పటం/గ్రామ నక్ష, భూ నక్ష అంటే ఏమిటి?
ఒక గ్రామంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించిన సర్వే మ్యాప్‌లను గ్రామ పటం/గ్రామ నక్ష, భూ నక్ష అని అంటారు. ఈ భూమి నక్షలో ప్రతి భూ సర్వేకు సంబంధించిన చిత్ర పటం ఉంటుంది. మీ భూమి పక్కన ఉన్న సర్వే నెంబర్లను మనం సులభంగా దీని సహాయంతో తెలుసుకోవచ్చు.
ధరణి పోర్టల్‌లో రెవెన్యూ గ్రామ పటం/గ్రామ నక్ష, భూ నక్ష ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- మొదట అధికారిక తెలంగాణ ధరణి పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు IM8 Cadstral Maps అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత CLICK HERE TO CONTINUE అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ జిల్లా, డివిజన్, మండలం, గ్రామం పేరు నమోదు చేయండి.
- మీ క్రింద చూపించినట్లు ఆ గ్రామంలోని ప్రతి సర్వే నెంబర్’కు సంబంధించిన మ్యాప్ కనిపిస్తుంది.
- ఇప్పుడు ఆ పటాన్ని ఫోటో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకోండి.
- భూ నక్ష భవిష్యత్‌లో చాలా ఉపయోగపడుతుంది.
భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెంబర్’కు కాల్ చేయండి => 6302212352