Wednesday, May 1, 2024
HomeHow ToCadastral Map: ధరణి పోర్టల్‌లో మీ ఊరి రెవెన్యూ నక్ష(Map) డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?

Cadastral Map: ధరణి పోర్టల్‌లో మీ ఊరి రెవెన్యూ నక్ష(Map) డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?

Download Village Cadastral Maps: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ పోర్టల్ వల్ల కొన్ని సమస్యలకు పరిష్కరం దొరికితే.. అయితే, మరికొన్ని సమస్యలు కొత్తగా వచ్చాయి.

(ఇది కూడా చదవండి: ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)

ఈ కొత్త సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త కొత్త ఆప్షన్లను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా గ్రామ పటం/గ్రామ నక్ష మనం మొబైలులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రెవెన్యూ గ్రామ పటం/గ్రామ నక్ష, భూ నక్ష అంటే ఏమిటి?

ఒక గ్రామంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించిన సర్వే మ్యాప్‌లను గ్రామ పటం/గ్రామ నక్ష, భూ నక్ష అని అంటారు. ఈ భూమి నక్షలో ప్రతి భూ సర్వేకు సంబంధించిన చిత్ర పటం ఉంటుంది. మీ భూమి పక్కన ఉన్న సర్వే నెంబర్లను మనం సులభంగా దీని సహాయంతో తెలుసుకోవచ్చు.

ధరణి పోర్టల్‌లో రెవెన్యూ గ్రామ పటం/గ్రామ నక్ష, భూ నక్ష ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • మొదట అధికారిక తెలంగాణ ధరణి పోర్టల్‌ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు IM8 Cadstral Maps అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత CLICK HERE TO CONTINUE అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ జిల్లా, డివిజన్, మండలం, గ్రామం పేరు నమోదు చేయండి.
  • మీ క్రింద చూపించినట్లు ఆ గ్రామంలోని ప్రతి సర్వే నెంబర్’కు సంబంధించిన మ్యాప్ కనిపిస్తుంది.
  • ఇప్పుడు ఆ పటాన్ని ఫోటో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకోండి.
  • భూ నక్ష భవిష్యత్లో చాలా ఉపయోగపడుతుంది.

భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెంబర్’కు కాల్ చేయండి => 6302212352

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles