తమ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారిలో ఎక్కువ మంది భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) అందిస్తోన్న పాలసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుందనే ప్రతి ఒక్కరి నమ్మకం. అయితే, సరైన సమయంలో తమ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించడం అనేది ప్రతి పాలసీ దారుడికి కష్టమైన పనే.
(ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?)
ఇంకా చెప్పాలంటే, ఎల్ఐసీ బ్రాంచ్‌కి వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో నిలుచుని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రీమియం చెల్లింపు ప్రక్రియను ఎల్‌ఐసీ మరింత సులభతరం చేసింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(UPI) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తోంది. అయితే, గూగుల్ పే ద్వారా ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ పేతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు చేసే విధానం:
- ముందుగా ఫోన్ యాప్‌లో లాగిన్ అయ్యి, బిల్లు చెల్లింపులు విభాగానికి వెళ్లాలి.
- ‘ఫైనాన్స్ & ట్యాక్సెస్’ విభాగంలో బీమా అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఇప్పుడు అందుబాటులో ఉన్న జాబితా నుంచి ‘LIC’ను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత పాలసీ నంబరు తదితర వివరాలు ఇచ్చి మీ ఎల్‌ఐసీ ఖాతాను యాడ్ చేసుకోవాలి.
- ఖాతాను లింక్ చేసిన తర్వాత, యూపీఐ పిన్ ఇచ్చి ఎల్‌ఐసీ ప్రీమియం సులభంగా చెల్లించవచ్చు.
- అప్పటికే తాజా విడత ప్రీమియం చెల్లించేసి ఉంటే.. పెండింగ్ లేదు అని మీకు చూపిస్తుంది.
- యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లింపులను అంగీకరించే ముందు ఈ-మెయిల్ ఐడీ కచ్చితంగా అడుగుతుంది.
- చెల్లింపులను స్వీకరించిన తర్వాత సంబంధిత రశీదు ఈ-మెయిల్‌కు వస్తుంది.
Note: గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా కూడా ఎల్‌ఐసీ ప్రీమియమ్‌లు చెల్లించవచ్చు. వాటి విధానం కూడా దాదాపుగా ఇలానే ఉంటుంది.