How to Check Property TAX Online in Telangana: మన దేశంలో ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని కలలు కంటారు. అలాంటి, ఇల్లు మన సొంతం అయినప్పుడు దానికి సంబంధించిన సమాచారం గురించి మనం తెలుసుకోవాలి. అయితే, స్వంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలలో ఆస్తి పన్ను(Property Tax) చాలా ముఖ్యమైనది. అస్సలు ఆస్తి పన్ను అంటే ఏమిటి?.. దానిని ఏ విధంగా లెక్కిస్తారు అనే వాటి గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏమిటి?
ఆస్తి పన్ను అంటే ఒక భూ యజమాని తాను నివసిస్తున్న ప్రాంత అభివృద్ది కోసం దగ్గరలోని స్థానిక సంస్థ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన ఒక వార్షిక పన్ను. ఈ పన్ను సాధారణంగా దేశంలోని మునిసిపల్ ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. ఈ ప్రాపర్టీ టాక్స్’ను రాష్ట్ర మునిసిపల్ సంస్థలు ఆ ప్రాంత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తాయి.
ఆస్తి పన్ను ఎన్ని భాగాలు:
ఆస్తి పన్నులో 4 భాగాలు ఉన్నాయి: సాధారణ పన్ను, నీరు మరియు పారుదల పన్ను, లైటింగ్ పన్ను మరియు స్కావెంజింగ్ పన్ను.
ఆస్తి పన్ను(Property Tax)ను ఏ విధంగా లెక్కిస్తారు:
ఆస్తి పన్ను అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఒక పన్ను రేటు, దీనిని మీ ఆస్తి వార్షిక అద్దె విలువ ఆధారంగా లెక్కిస్తారు. పన్ను రేటు కూడా ఆస్తి వార్షిక అద్దె విలువపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం, నగరం, పట్టణం, మండలాల వారీగా పన్ను రేటు మారుతూ ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
తెలంగాణలో ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
- మీరు హైదరాబాద్ పరిధిలో నివసిస్తే https://www.ghmc.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత Our Service => Property Tax => GHMC=> Know Your Property Tax Details ఎంచుకోండి.
- ఇప్పుడు మీ సర్కిల్, PTIN No, ఇంటి యజమాని పేరు, డోర్ నెంబర్ వివరాలు నమోదు చేసి SUBMIT మీద క్లిక్ చేయండి.
- అప్పుడు మీ ప్రాపర్టీకి సంబంధించి ఎంత టాక్స్ చెల్లించాలో మీకు తెలుస్తుంది.
తెలంగాణలో ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?
- తెలంగాణలో ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో చెల్లించడం ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- అధికారిక CDMA వెబ్‌సైట్‌ను(https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu) సందర్శించండి
- మీ PTI నంబర్‌ని నమోదు చేసి, ఆస్తిపన్ను బకాయిగా తెలుసుకోండి బటన్‌పై క్లిక్ చేయండి
- మీరు క్రిందికి స్క్రోల్ చేసినప్పుడు, మీరు చెల్లించవలసిన మొత్తం వివరాలను చూస్తారు. మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDని నమోదు చేసి, చెల్లింపు బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు.