భారత్ లో ఆధార్ ను తప్పనిసరి గుర్తింపు పత్రంగా కేంద్రం చేసిన సంగతి మనకు తెలిసందే. ప్రతి చిన్న పనికి మనకు ఎక్కడో ఒక దగ్గర దీని అవసరం ఉంటుంది. అందుకే మనం ఆధార్ కార్డు ఉపయోగించి ఏదైనా పని చేసినప్పుడు తప్పనిసరిగా ఆధార్ కు లింకు అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP (వన్-టైమ్-పాస్‌వర్డ్) పంపబడుతుంది. అందుకే మీ ప్రస్తుత మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డులో అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. కొన్ని ఇతర కారణాల వల్ల మీ ఫోన్‌ను కోల్పోయిన లేదా క్రొత్త నంబర్‌కు మారిన ప్రతి సారి తప్పనిసరిగా మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డుతో లింకు చేయడం మంచిది. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ఆధార్ కేంద్రంలోని పొడవైన క్యూ లైన్ ను నుంచి తప్పించుకోవడానికి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

  • మీరు ముందుగా ఆధార్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు “మై ఆధార్” సెక్షన్ కింద ఉన్న “బుక్ ఆన్ అపాయింట్‌మెంట్” అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు “ప్రొసీడ్ టు బుక్ అపాయింట్‌మెంట్” పై క్లిక్ చేయండి.
  • మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ లేదా మెయిల్ తో లాగిన్ అవ్వండి.
  • మీకు తర్వాత ట్యాబ్ లో కనిపించే “అప్డేట్ ఆధార్” ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీ పేరు, ఆధార నెంబర్ ఎంటర్ చేసి మీరు దేనిని అయితే ఛేంజ్ చేయాలని అనుకుంటటున్నారో దాని మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రం యొక్క ప్రాంత వివరాలు సమర్పించి స్లాట్ బుక్ చేసుకుండి.
  • మీరు స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి 50 నుంచి 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
  • మీ మొబైల్ నెంబర్ లోపు ఎప్పుడైనా మారవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here