Saturday, November 23, 2024
HomeGovernmentAndhra PradeshIncome Certificate: ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Income Certificate: ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

How to Get Income Certificate in Telangana, Andhra Pradesh?: విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం, నిరుద్యోగులు జాబ్స్ కోసం, ప్రజలు ఇతర అవసరాల కోసం ఏదో ఒక సందర్భంలో ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(Income Certificate) చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది చదువుకున్న వారికి ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(Income Certificate) ఎలా దరఖాస్తు చేసుకోవాలో అనేది చాలా వరకు తెలియదు.

(ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణలో కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

మరోవైపు రెవెన్యూ శాఖలో తెలంగాణ. ఏపీ ప్రభుత్వాలు కొత్త కొత్త సంస్కరణలు ప్రవేశ పెడుతున్నాయి. అసలు ఈ పత్రం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వీటికి కావాల్సిన పత్రాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:

  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డ్
  3. పట్టా పాస్ బుక్(భూమి ఉంటే)
  4. ఐటి రిటర్న్స్/ పే స్లిప్స్ (ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు)
  5. అప్లికేషన్ ఫారమ్

దరఖాస్తు విధానం:

  • మొదట మీరు పైన పేర్కొన్న పత్రాలను జిరాక్స్ అనేది తీసుకోవాలి
  • ఏపీ/తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అప్లికేషన్ ఫారంలో మీ వివరాలను నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫారంలో మీ పేరు, చిరునామా, రేషన్ కార్డు నెంబర్, ఆదాయం, దేని కోసం అనేది రాయాలి.
  • మీ సేవ/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • మొదట మీ గ్రామ వీఆర్ఓ, ఆ తర్వాత మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత డిప్యూటీ తహశీల్దార్, చివరకు తహశీల్దార్ వివరాలను దృవీకరించి సంతక చేస్తారు.
  • మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఆయా రాష్ట్రాల(ఏపీ, తెలంగాణ) మీ సేవ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
  • దరఖాస్తు కోసం రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆదాయ ధృవీకరణ పత్ర ఆమోదం కోసం 7 రోజుల గడువు ఇచ్చారు.

మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన టెక్ పాఠశాల టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆడగవచ్చు. అలాగే మీకు తోచిన అంతా సహాయం చేసి మన పోర్టల్ ను అదుకోగలరు అని మనవి.

Support Tech Patashala

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles