Sunday, October 13, 2024
HomeTechnologyAppsసరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్

సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్

COVID-19 వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడ జనాలు ఇంటికే పరిమితమయ్యారు. దీనితో ప్రయాణాలు లేకపోవడంతో మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగం తగ్గింది. గూగుల్ మ్యాప్స్ ఈ సమయంలో తన సేవలను మెరుగు పరుచుకుంది. నేడు గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాన్సిట్ “క్రౌడ్నెస్(జనసమూహం)” అనే ఫీచర్ తో పాటు మరో రెండు కొత్త ఫీచర్ లను తీసుకొచ్చింది. అంతే కాదు ఈ వ్యాది మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 250 కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చింది.

తాజాగా, గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాన్సిట్ “Crowdedness(జనసమూహం)” డేటా అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణిచాలనుకుట్టున్న దారిలో ప్రజారవాణాకు సంబందించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంటే బస్సులు, రైళ్లు మరియు సబ్వేల వంటి వాటిలో ఎక్కువ మంది ఎందులో ప్రయాణిస్తున్నారనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. దాని వల్ల మీరు మరో ప్రత్యామ్నాయం ద్వారా ప్రయాణించొచ్చు. ఈ సమాచారం అంతా మీకు గూగుల్ మ్యాప్స్ లో ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్, వారి లైవ్ స్టేటస్ ఆధారంగా తెలియజేస్తునట్లు గూగుల్ తెలిపింది. ఈ సమాచారం ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలలో లభిస్తుంది కావున అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండకపోచ్చని తెలిపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది పనిచేస్తుందని వెల్లడించింది.(చదవండి: లీకైన పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్)

మరో ముఖ్యవిషయం ఏమిటంటే మ్యాప్స్ ద్వారా ఆహార పంపిణీ(Food delivery) అనుకూలమైన కేంద్రంగా మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్‌లలో ఫుడ్‌ డెలివరీ లైవ్‌ స్టేటస్‌, డెలివరీకి పట్టే సమయం, డెలివరీ ఛార్జీలు వంటి వివరాలను చూపిస్తున్నారట. కొద్ది రోజుల్లో ఈ ఫీచర్స్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles