ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ యాప్ కచ్చితంగా ఉంటుంది. వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెల్ఫీ కల్చర్‌ భాగ పెరిగింది. దాదాపు 90 శాతం మంది ప్రతి రోజు ఏదో ఒక ఫోటోనో లేక వీడియోనో వారి స్టేటస్‌లో అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి పెట్టిన స్టేటస్‌ 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రతి రోజూ ఓ సెల్ఫీ తీసుకునో, ఫోన్‌లో ఉన్న ఫొటోల్లో ఉత్తమమైనది ఎంచుకునో సెల్ఫీలుగా పెట్టుకుంటారు.(ఇది కూడా చదవండి: చిన్న టెక్నిక్‌తో క‌రోనాను జ‌యించిన 82 ఏళ్ల బామ్మ!)

మిగిలిన వారిలో కొందరు సందేశాలు, హితోక్తులు, సామెతలతో నింపేసేవాళ్లు. మరికొందరైతే వీడియోలు, జోకులు పెడుతుంటారు. ఇలా నిత్యం మనకు తెలిసిన మిత్రులు, బందువులు వారి భావాలను స్టేటస్ రూపంలో తెలియజేస్తారు. అలా వారు పెట్టిన వాటిలో ఫోటో, వీడియో మనకు డౌన్ లోడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. అయితే, స్టేటస్ వీడియో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. అందుకోసం ఈ క్రింద చెప్పిన విదంగా చేయండి.

  1. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్‌లోకి వెళ్లండి.
  2. మీరు ఏం డౌన్‌లోడ్ చెయ్యాలనుకుంటున్నారో దానిని ఒకసారి మంచిగా పరిశీలించండి.
  3. ఇప్పుడు మీ మొబైల్‌లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ను ఓపెన్ చెయ్యండి.
  4. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి Show Hidden Files అనే ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి.
  5. మళ్లీ వెనక్కి వచ్చి స్టోరేజ్‌లోకి వెళ్లి వాట్సాప్‌ ఫోల్డర్ ఆప్షన్‌ ఓపెన్ చేయండి.
  6. వాట్సాప్ ఫోల్డర్ లో కనిపించే మీడియా ఆప్షన్‌లో స్టేటస్(statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. అందులో వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన వీడియోలు, ఫొటోలూ కనిపిస్తాయి.
  8. మీకు నచ్చిన దానిని కాపీ చేసి వేరే ఫోల్డర్ లో వేసుకోండి.

పైన చెప్పిన విధంగా మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫొటోలూ, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి Whatsapp Status Download Manager App Install చేసుకొని కూడా మీకు నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.