Saturday, May 4, 2024
HomeBusinessదేశంలో బయటపడిన మరో భారీ కుంభకోణం

దేశంలో బయటపడిన మరో భారీ కుంభకోణం

దేశంలో మరో భారీ కుంభకోణం బయటపడింది. వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో సంబంధం ఉన్న గార్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్(జీఐపీఎల్) యజమాని సంజయ్ భాటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి, మరో 14 మంది కలిసి దేశవ్యాప్తంగా సుమారు రూ.15,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన, మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన సంజయ్‌ భాటి 2017లో బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. ఈ బైక్ సర్విస్ ముసుగులో మోసపూరిత ఆర్థిక పథకాలను రూపొందించాడు. “పెట్టుబడుదారులు ఒక బైక్ మీద రూ.62,000 పెట్టుబడి పెట్టి అద్దె రూపంలో రూ.4,590, లాభం రూపంలో రూ.5,175 ప్రతి నెల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇలా పెట్టుబడి వల్ల ఏడాదికి రూ.1.17 లక్షలు పొందవచ్చు” అని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తక్కువ సమయంలో డబ్బులు వస్తున్నాయి అని చాలా మంది పెట్టుబడి పెట్టారు.

bike_bot_scam_UP

ఈ తర్వాత కంపెనీ ప్రమోటర్లు నోయిడా, గ్రేటర్ నోయిడా, అలీఘర్, ఘజియాబాద్, సహరాన్ పూర్, ముజఫర్ పూర్, ఢిల్లీ, జైపూర్, హర్యానా, తదితర ప్రాంతాల్లో బైక్ బాట్ ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించారు. వీరిని నమ్మించడానికి నిందితులు సుమారు 10,000 పెట్రోల్ బైక్లను, కొన్ని ఎలక్ట్రిక్-బైక్ లను కొనుగోలు చేశారు. జైపూర్ నివాసి సునీల్ కుమార్ మీనా 2019 ఫిబ్రవరి 14న దాద్రీ పోలీస్ స్టేషన్లో బైక్ బాట్ ఆపరేటర్ సంజయ్ భాటిపై, సంస్థ ఐదుగురు డైరెక్టర్లు – రాజేష్ భరద్వాజ్, సునీల్ కుమార్ ప్రజాపతి, దిప్తి బెహ్ల్, సచిన్ భాటి, మరియు కరణ్ పాల్ సింగ్ లపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ కుంభకోణం బయటపడింది.

అక్టోబర్ 2018లో జైపూర్ లో బైక్ బాట్ టాక్సీ ఫ్రాంచైజీని పొందడానికి మీనా భాటితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయన గ్రావిట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలో రూ.34లక్షలు చెల్లించారు. 51 బైక్స్ తో జైపూర్ ఫ్రాంచైజీ ఓపెన్ చేయనున్నట్లు కంపెనీ అతనికి వాగ్దానం చేసింది. “ఈ పథకం ఢిల్లీలో పనిచేస్తున్న ఇతర బైక్ అగ్రిగేటర్ కంపెనీల మాదిరిగానే ఉంది. కానీ కంపెనీ అధిక రాబడులు, తన సొంత ఖజానా నుంచి డ్రైవర్లకు జీతం, యజమానులకు క్రెడిట్ రిటర్న్లను ఇస్తామని వాగ్దానం చేసింది” అని మీనా తన ఫిర్యాదులో తెలిపింది.

మీనా పెట్టుబడి పెట్టిన దానికి నెలకు 6.45 లక్షలు రావాల్సి ఉండేది. కానీ, అతను నెలకు రూ.66,000 మాత్రమే అందుకున్నాడు. ఆ తర్వాత అది కూడా రాలేదు. దీంతో అతనికి అనుమానం వచ్చి పోలీసులకు తెలిపారు. ఇంకా ఎఫ్‌ఐఆర్‌లో ఇలా పేర్కొన్నారు. “ప్రస్తుతం ఉన్న ఈ బైక్స్ షోపీస్ మాత్రమే అని కంపెనీ అధికారులు నాకు తెలియజేశారు. ఇందులో ఎక్కువ మంది పెట్టుబడిదారులు పెట్టుబడిపెట్టిన తర్వాత మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తాం. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మీరు మరింత మందిని ఇందులో జాయిన్ చేయాలని పేర్కొన్నట్లు” అని మీనా ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

- Advertisement -

కంపెనీ మీనాకు 26 బైక్స్ పంపింది. తన ₹34 లక్షల పెట్టుబడికి ఒక సంవత్సరంలో రూ.75 లక్షల రిటర్న్స్ వస్తాయని వాగ్దానం చేశారు, కానీ అతనికి రాలేదు. దీంతో కంపెనీ మీద దాద్రీ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 467, సెక్షన్ 471 , ఐపీసీ సెక్షన్ 408 కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి కొనసాగుతున్న వస్తున్న కేసు ఇటీవల సీబీఐ తీసుకొన్న తర్వాత ఈ కుంభకోణం విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంటుంది అని తెలిపింది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles