Thursday, April 25, 2024
HomeBusinessPersonal Loan Interest Rates: 2024లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్‌?

Personal Loan Interest Rates: 2024లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్‌?

Personal Loan Interest Rates 2024 in Telugu: పర్సనల్ లోన్ అనేది ఎటువంటి పూచీకత్తు లేదా సెక్యూరిటీ అవసరం లేని ఒక రుణం. ఈ లోన్ తీసుకోవడానికి రుణదాతకు కొన్ని డాక్యుమెంట్లు అందించడం ద్వారా మీరు ఈ రుణాన్ని పొందవచ్చు. బ్యాంకులు కూడా మెరుగైన క్రెడిట్‌ స్కోరు(750+) గల వారికి తక్కువ వడ్డీ రేట్లకే ఈ రుణాలను అందిస్తాయి. ఈ రుణాల కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా పండుగ ఆఫర్లు అమల్లో ఉన్నప్పుడు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే, తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని పొందొచ్చు. అయితే, ఈ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వసూలు చేసే వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్‌ ఫీజులను కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

(ఇది కూడా చదవండి: పీఎం సూర్య ఘర్‌ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)

కొన్ని బ్యాంకులు కనీసం ఒక ఈఎంఐ చెల్లించిన తర్వాత మీ పర్సనల్ లోన్’ను ముందస్తుగా చెల్లించడానికి అనుమతిస్తాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రీ క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తాయి.

2024లో వివిధ బ్యాంకుల పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు:

పర్సనల్ లోన్ ఈఎంఐని ఎలా లెక్కిస్తారు?

రుణ మొత్తం, రుణ వ్యవధి, తీసుకున్న వడ్డీ ద్వారా మీ ఈఎమ్ఐ నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్‌ ఈఎమ్ఐలను ఇన్‌స్టంట్‌గా కాలిక్యులేట్‌ చేయడానికి చాలా వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు ఈ సర్వీసులను అందిస్తున్నాయి.

వ్యక్తిగత రుణ ఈఎమ్ఐని నిర్ణయించే ప్రధాన అంశాలు:

  • రుణ మొత్తం
  • వడ్డీ రేటు
  • కాలపరిమితి

పర్సనల్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు:

  • లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు – 2.
  • యజమాని జారీ చేసిన గుర్తింపు కార్డు కాపీ.
  • ఎస్బీఐలో శాలరీ అకౌంట్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్.
  • గత 6 నెలల వేతన స్లిప్ లేదా తాజా ఫారం 16 (ఆదాయపు పన్ను చెల్లింపుదారుడి విషయంలో).
  • పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్).
  • గుర్తింపు రుజువు మరియు ప్రస్తుత చిరునామాగా(పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ నెంబరు) కార్డులో ఏదో ఒకటి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles