Nano Electric Car Price, Range: నా దేశంలోని ప్రతి ఇంట్లో ఓ కారుండాలి. నా దేశంలోని ప్రతి పౌరుడు కారులోని తిరగాలని కలగన్న గొప్ప వ్యక్తి రతన్ టాటా. ఈ దేశపు మట్టి. ఈ దేశపు గౌరవం. ఈ దేశపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అందుకే అతి సామాన్యుడికి కూడా కారు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అందుకు ఓ బలమైన కారణం ఉంది. 16 ఏళ్ల క్రితం నానో కారు ఆటోమొబైల్ రంగంలో ఓ పెను సంచలనం. ఓ రోజు రతన్ టాటా ఎప్పటిలాగే కారులో ఆఫీస్ కు వెళుతున్నారు. ఓ సిగ్నల్ వద్ద కారు ఆగింది. ఆ కారు పక్కనే ద్విచక్రవాహనం మీద ఓ తండ్రి తన భార్యను తన ఇద్దరు పిల్లల్ని స్కూల్ కి తీసుకెళుతున్నట్లు గమనించారు. అయితే రోడ్లపై గుంతలు, గతుకుల ప్రయాణంలో జరగరానిది ఏదైనా జరిగితే ..ఆ పిల్లల పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనకు గురయ్యారు.
అప్పటికే ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న రతన్ టాటా తన టాటా ఆటోమొబైల్ సంస్థ ఆర్ అండ్ ఎండీ నిపుణులతో సమావేశమయ్యారు. ప్రతి మధ్య తరగతి భారతీయుడికి ఓ కారు ఉండాలనేది నా కల. దాని ధర లక్ష రూపాయిలు ఉండాలి. అందుకు మీరు ఎలాంటి కారును తయారు చేస్తారో చేయండి. నష్టం వచ్చిన ఫర్వాలేదని వారికి పెద్ద బాధ్యతనే అప్పగించారు.
అలా 2008 జనవరి 10న నానో కారు లాంచ్ అయ్యింది. ఆ సమయంలో భారత్ లో అతి తక్కువ ధరకే దొరికే కారు ఏదైనా ఉందా అంటే నానో కారే. కానీ అలాంటి నానో కారు భారతీయుల సోకుల ముందు నిలబడలేకపోయింది. నిరాధారణకు గురైంది. నానో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది.
(ఇది కూడా చదవండి: కారు లోన్ తీసుకునేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!)
నానో కార్ల ఉత్పత్తి ఆగిపోయినా రతన్ టాటా తన కలను మరిచిపోలేదు. ప్రతి భారతీయుడు బడ్జెట్ ధరలో లభ్యమయ్యే కారులో తిరగాలనే తన కలను నిరవేర్చుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారు. ఫ్యూయల్ వెర్షన్ ఫెయిలయినా వెనకడుగు వేయలేదు. ఈ సారి ఎలక్ట్రిక్ వెర్షన్ లో అదీ టాటా నానో.ఈవీ కారును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, అదిగో అదీ టాటా నానో ఎలక్ట్రిక్ కారు వస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల ప్రకారం.. టాటా నానో.ఈవీ కారు సింగిల్ చార్జింగ్ చేస్తే సుమారు 200-300 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. దీంతో పాటు కారులోనూ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, స్టాండర్డ్ ఏసీ చార్జింగ్, డీసీ ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండనున్నట్లు సమాచారం. లగ్జరీ కారు ధరతో పోలిస్తే ఈ టాటా నానో.ఈవీ కారు ధర తక్కువకే అందిస్తూ బేసిక్ ఫీచర్లు జత చేయనుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సింగిల్ చార్జింగ్ తో 300 కి.మీ దూరం ప్రయాణం చేసే సామర్ధ్యం ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రీమియం మోడల్ ధర రూ.7 నుంచి 8 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
ఇక ఈ కార్ సాంకేతికత పరంగా నానో ఈవీ ఆండ్రాయిడ్, యాపిల్ కార్‌ప్లే రెండింటికి అనుకూలమైన పెద్ద టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్‌లలో జీపీఎస్ నావిగేషన్, రియల్ టైమ్ వెహికల్ డయాగ్నోస్టిక్స్, క్లైమేట్ కంట్రోల్ ప్రీ-సెట్టింగ్, బ్యాటరీ ఛార్జ్ మానిటరింగ్ వంటి రిమోట్ ఫంక్షన్‌ల కోసం మొబైల్ కనెక్టివిటీ ఉండవచ్చు. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్, భద్రతను మెరుగుపరచడానికి అధునాతన ఫీచర్‌లలో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉండనుందది.
ఇక లుక్స్, డిజైన్ పరంగా భవిష్యత్ నానో అద్భుతంగా, క్లాసీగా, ప్రీమియంగా కనిపించేలా డిజైన్ చేయనుంది టాటా యాజమాన్యం. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనంగా టాటా నానో రీ ఎంట్రీపై ఆలోచన ఆసక్తికరంగా మారుతోంది. ట్రెండ్ కు తగ్గట్లు వాహనదారుడి ఆలోచనకు టాటా నానో కారు లభిస్తే ఈవీ మార్కెట్ లో నానో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారిపోనుంది.