Friday, April 26, 2024
HomeAutomobileCar Loan: కారు లోన్ తీసుకునేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Car Loan: కారు లోన్ తీసుకునేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Car Loan: ప్రస్తుత ఆధునిక యుగంలో చాలా మందికి ఓ మంచి కారు కొనుక్కోవలనే ఒక కోరిక ఉంటుంది. అయితే, వారి దగ్గర సరిపడినంత నగదు లేకపోవడంతో బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని కొనుక్కోవలని అనుకుంటున్నారు. అయితే కారు కొనేందుకు.. సరైన ప్రణాళిక అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే, దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

సిబిల్​ స్కోరు చెక్ చేసుకోవాలి?

మీరు రుణం​ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకులు ముందుగా రుణ గ్రహీత సిబిల్ ​స్కోరును(క్రెడిట్​స్కోరు) విశ్లేషిస్తాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వ్యక్తికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు. ముఖ్యంగా వెహికల్​ లోన్​ల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాయి. అందుకే, కారు కొనాలని అనుకున్న వెంటనే మీ సిబిల్​ స్కోరును వెంటనే చెక్ చేసుకోవాలి. స్కోరు 750కి మించి ఉన్నప్పడే అనుకున్న మీకు రుణం లభిస్తుంది.

వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను పోల్చిచూడండి

ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాలను, వాటి వడ్డీ రేట్లను సరిపోల్చుకోండి. బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా రుణం గురుంచి తెలుసుకోవచ్చు. కారు లోన్​ సాధారణంగా 7 ఏళ్ల పాటు ఉంటుంది. గనుక, రుణదాత విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వాయిదా గడువు తేదీ దాటితే విధించే జరిమానాలతో పాటు, అన్ని రుసుముల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

(ఇది కూడా చదవండి: ఆదిరిపోయిన బెస్ట్యూన్ షావోమా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, ధర ఎంతో తెలుసా?)

ఎంత వరకూ లోన్​ ఇస్తున్నారో చూసుకోండి. కొన్ని బ్యాంకులు ఆన్‌రోడ్‌ ప్రైస్​పై 100 శాతం రుణాలు ఇస్తున్నాయి. మీ అర్హతకు అనుగుణంగా, ఇలాంటివీ చూడొచ్చు. వీలైనంత వరకూ తక్కువ లోన్​ తీసుకోవడమే ఎల్లప్పుడూ మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

- Advertisement -

తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకు నుంచి..

మీ సాలరీ అకౌంట్​ లేదా సేవింగ్​ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి సులభంగా రుణం పొందవచ్చు. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకు నుంచి వాహన రుణం తీసుకోవడమే ఎల్లప్పుడూ ఉత్తమం. వడ్డీ రేటులో చిన్న వ్యత్యాసం ఉన్న మీ దీర్ఘకాలిక చెల్లింపులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. వివిధ వడ్డీ రేట్ల ఆధారంగా ఈఎంఐ ఎంత చెల్లించాలో అంచనా వేసుకోండి.

ఇప్పటికే లోన్స్​ ఉంటే..

కొత్త లోన్​ తీసుకునే ముందు ఇప్పటికే ఉన్న రుణాల గురించి తెలుసుకోవాలి. మీకు వచ్చే ఆదాయం, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం చెక్ చేసుకోవాలి. అధిక రుణ-ఆదాయ(క్రెడిట్​-ఇన్​కమ్ రేషియో) నిష్పత్తి క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుంది. కనుక, కారు కొనేందుకు లోన్​ తీసుకునే ముందు చిన్న చిన్న రుణాలను తీర్చేయండి. అప్పుడు మీకు అప్పు ఎక్కువ లభించే అవకాశం ఉంటుంది.

(ఇది కూడా చదవండి: Credit Score: మీ క్రెడిట్ స్కోర్ సులభంగా పెంచుకోండి ఇలా..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles