ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఆంపియర్ కంపెనీ శుభవార్త తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి గుజరాత్ రాష్ట్రం కొత్తగా 2021 ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కొద్ది రోజుల క్రితమే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం టూ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు వాటి ధర మీద రూ.20,000 సబ్సిడీని అందిస్తుంది. ఇప్పటికే కేంద్రం ఫేమ్ -2 కింద భారీగా సబ్సిడీ అందిస్తుంది. ఇప్పుడు అదనంగా రాష్ట్రాలు కూడా సబ్సిడీ ఇవ్వడంతో ఎలక్ట్రిక్ వాహన ధరలు భారీగా దిగివస్తున్నాయి. దీంతో అనేక కంపెనీలు ఈ సబ్సిడీ ధరను తగ్గించి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి.
ప్రతి మోడల్ పై రూ.27,000 తగ్గింపు
తాజాగా ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ కూడా మాగ్నస్, జీల్ మోడల్ స్కూటర్ల అసలు ధరపై రూ.27,000పైగా తగ్గించింది. గతంలో ఆంపియర్ మాగ్నస్ స్కూటర్ అసలు ధర ₹74,990 అయితే, ఇప్పుడు గుజరాత్ కస్టమర్లు కేవలం ₹47,990 చెల్లించి మాగ్నస్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, జీల్ మోడల్ స్కూటర్ అసలు ధర ₹68,990 అయితే, ₹41,990 (ఎక్స్ షోరూమ్) గుజరాత్ ప్రజలు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆంపియర్ ఎలక్ట్రిక్ ప్రతినిధి రాయ్ కురియన్ ఇలా మాట్లాడారు.. “ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గుజరాత్ ప్రభుత్వం నూతన 2021 ఈవీ పాలసీని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.. మీరు తీసుకున్న అసాధారణ నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ ఒక సామాన్యడికి ఈవీలు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయని” ఆయన అన్నారు.

ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పెట్రోల్ ఖర్చులు తగ్గడమే కాకుండా రవాణా ఖర్చుల కూడా భారీగా తగ్గుతాయని ఆయన తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం 2021 ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ₹20,000 సబ్సిడీని, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు ₹1.5 లక్షల సబ్సిడీని అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 250 కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆఫర్ కేవలం గుజరాత్ రాష్ట్ర ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.