దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో రోజు రోజుకి పోటీ విపరీతంగా పెరిగిపోతుంది. స్టార్టప్ కంపెనీల నుంచి అగ్ర పెద్ద పెద్ద కంపెనీల వరకు దీని వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఎలక్ట్రిక్ వాహనలకు భారత్ ప్రపంచంలో పెద్ద మార్కెట్ గా కనిపిస్తుంది. అందుకే రోజుకో ఒక కంపెనీ సరికొత్త మోడల్‌ని ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈవీ రంగంలో హీరో, ఈథర్‌, ఒకినావాల వాహనాలు సందండి చేస్తుండగా తాజాగా ఈ జాబితాలో బజాజ్‌ కూడా చేరనుంది. ఫ్రీ రైడర్‌ పేరుతో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్తగా ట్రేడ్‌మార్క్‌ రిజిస్టర్‌ చేయించింది.

ఇండియా ద్విచక్ర వాహనాల మార్కెట్లో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు దేశం మొత్తాన్ని చేతక్‌ స్కూటర్‌ ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన పల్సర్ యూత్‌లో మంచి క్రేజ్‌ని సాధించింది. ఇప్పటికే యూత్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న బైక్‌లలో పల్సర్‌ ఒకటి. మిగిలిన బజాజ్‌ మోడల్స్‌కి రూరల్‌ ఇండియాలో మంచి కస్టమర్‌ బేస్‌ ఉంది. తాజాగా ఈవీ సెగ్మెంట్‌పైనా బజాజ్‌ ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో ఉండగా మరో కొత్త మోడల్‌ను తీసుకు వచ్చేందుకు సిద్దమైంది. ఫ్రీ రైడర్‌ పేరుతో మరో కొత్త స్కూటర్‌ని మార్కెట్లోకి తేనుంది. దీనికి సంబంధించిన ట్రేడ్‌ మార్క్‌ కోసం ఈ ఏడాది మార్చి 1న అప్లయ్‌ చేస్తే.. జూన్‌ 1న ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనల తయారిని ప్రోత్సహిస్తున్నాయి.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here