Saturday, April 20, 2024
HomeAutomobileTop 5 Electric Scooter Under 1 Lakh: రూ.లక్ష కన్నా తక్కువకే లభిస్తున్న టాప్-5...

Top 5 Electric Scooter Under 1 Lakh: రూ.లక్ష కన్నా తక్కువకే లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Top 5 Best Electric Scooters Under 1 Lakh in India: దేశంలో గతంలో భారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాముఖ్యత పెరిగింది. అప్పటి నుంచి వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

(ఇది కూడా చదవండి: Cheapest Electric Scooters: ఈవీ మార్కెట్లో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)

ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థలు తమ వాహనాలు విడుదల చేస్తే, మరికొన్ని సంస్థలు తమ వాహనాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో రూ. 1 లక్ష లోపు అందుబాటులో ఉన్న ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలో రూ. లక్ష లోపు అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

పెరుగుతున్న కాలుష్యం, విపరీతమైన ఇంధన ధరల పేరుగదల మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇవి తక్కువ ఖర్చుకు ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు పర్యావరణ అనుకూలమైనవి.

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్

భారతదేశంలో ఈ స్కూటర్ 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. తెలంగాణ‌లో ఎక్స్‌షోరూం ధర 86,500. దీనిలో ముందు వైపు డిస్క్ బ్రేకులు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను అమ‌ర్చారు. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ రెండు చక్రాల కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనిలో పవర్ మరియు ఎకానమీ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

- Advertisement -

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్పెసిఫికేషన్లు:

బ్యాటరీ కెపాసిటీ1.87 కిలోవాట్
ఛార్జింగ్ సమయం 5 గంటలు
రేంజ్108 కిలోమీటర్లు
అత్యధిక వేగం45 కి.మీ/గంటకు
ధరరూ.86,391

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, యాంటీ-థెఫ్ట్ అలారం మరియు ఇంటెలిజెంట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఒకినావా రిడ్జ్ ప్లస్

ఒకినావా ఆటోటెక్ గత సంవత్సరం మార్కెట్ వాటా పరంగా హీరో ఎలక్ట్రిక్ తరువాత రెండవ స్థానంలో ఉంది. దీనిలో టెక్నాలజీ పరంగా చాలా ఫీచర్స్ ఉన్నాయి.

ఒకినావా రిడ్జ్ ప్లస్ స్పెసిఫికేషన్లు:

బ్యాటరీ కెపాసిటీ1.75 కిలోవాట్
ఛార్జింగ్ సమయం 3 గంటలు
రేంజ్120 కిలోమీటర్లు
అత్యధిక వేగం55 కి.మీ/గంటకు
ధరరూ.90,606

బౌన్స్ ఇన్ఫినిటీ E1

బౌన్స్ కంపెనీ 2021లో బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని బ్యాటరీలో సిమ్ కార్డ్‌ను అమర్చే ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు బ్యాటరీ లేకుండా దీనిని కొనుగోలు చేయవచ్చు, ఇంకా బయటి నుండి బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీని సులభంగా తీసివేసి, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్పెసిఫికేషన్లు:

బ్యాటరీ కెపాసిటీ1.9 కిలోవాట్
ఛార్జింగ్ సమయం 5 గంటలు
రేంజ్85 కిలోమీటర్లు
అత్యధిక వేగం65 కి.మీ/గంటకు
ధరరూ.70,000

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్:

భారత సంతతికి చెందిన రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా గత ఏడాది ఓలా ఎస్1ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా ప్రజధారణ పొందుతుంది. ఈ స్కూటర్ స్పెసిఫికేషన్స్ క్రింది విధంగా ఉన్నాయి.

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లు:

బ్యాటరీ కెపాసిటీ2.98 కిలోవాట్
ఛార్జింగ్ సమయం 5 గంటలు
రేంజ్120 కిలోమీటర్లు
అత్యధిక వేగం90 కి.మీ/గంటకు
ధరరూ.99,999

ఓలా ఎస్ 1 భారతదేశంలో 1 లక్ష లోపు ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్రస్థానంలో ఉంది. స్టైలిష్ డిజైన్, చౌకైన టెక్నాలజీతో దీని డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది.

- Advertisement -

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్:

ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్నా టీవీఎస్ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో 1 లక్ష లోపు ఉన్న ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు:

బ్యాటరీ కెపాసిటీ3.04 కిలోవాట్
ఛార్జింగ్ సమయం 5 గంటలు
రేంజ్75 కిలోమీటర్లు
అత్యధిక వేగం78 కి.మీ/గంటకు
ధరరూ.100,000

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ అసిస్ట్, పెద్ద డ్యాష్బోర్డ్ మరియు సౌకర్యవంతమైన స్టోరేజ్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles