Wednesday, October 16, 2024
HomeAutomobileVida Electric Scooter: అదిరిపోయిన హీరో తొలి విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో...

Vida Electric Scooter: అదిరిపోయిన హీరో తొలి విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?

Hero Motocorp Launched Vida Electric Scooter in India: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ హీరో మోటోకార్ప్ తన తొలి విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్’లోకి విడుదల చేసింది. విడా వీ1 ప్రొ, వీ1 ప్లస్(Vida V1 PRO, Vida V1 Plus) అనే పేరుతో కంపెనీ లాంచ్‌ చేసింది. విడా బ్రాండ్‌ క్రింద ఎలక్ట్రిక్-స్కూటర్‌లను ప్రారంభించడంతో దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటోకార్ప్ రంగ ప్రవేశం చేసింది.

హీరో మోటోకార్ప్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

విడా వీ1 ప్లస్(Vida V1 Plus) ధరను ఇండియాలో రూ.1.45 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా వీ1 ప్రో(Vida V1 Pro) ధర రూ.1.59 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ బుక్ చేసుకోవడానికి రూ.2499 చెల్లించాల్సి ఉంటుంది.

విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ నగరాలలో అందుబాటులో ఉంది?

ప్రస్తుతానికి బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ మూడు నగరాల్లో అందుబాటులో ఉంది. ఆ తర్వాత దశల వారీగా ఇది అందుబాటులోకి రానుంది.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?)

విడా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ తేదీ?

ఈ విడా వీ1 ప్రొ, వీ1 ప్లస్ స్కూటర్ బుకింగ్‌లు అక్టోబర్ 10న ప్రారంభమవుతాయి. అయితే, డిసెంబర్ రెండో వారం నుంచి స్కూటర్’లను డెలివరీలు చేయనున్నట్లు హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

- Advertisement -

విడా వీ1 ప్రొ, వీ1 ప్లస్ ఈ-స్కూటర్ రేంజ్ ఎంత?

ఒక్కో ఛార్జింగ్‌కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్‌ను అందించనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అయితే, స్కూటర్ వేరియంట్ బట్టి రేంజ్ మారనున్నట్లు కంపెనీ తెలిపింది.

విడా వీ1 ప్రొ, వీ1 ప్లస్ ఈ-స్కూటర్ ఫీచర్స్

ఈ స్కూటర్ల ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?)

కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఈ-స్కూటర్‌లతో పోటీ పడనుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles