Wednesday, October 16, 2024
HomeBusinessRBI Hikes Repo Rate: రెపో రేటును భారీగా పెంచిన ఆర్‌బీఐ.. EMIలు కట్టే వారికి...

RBI Hikes Repo Rate: రెపో రేటును భారీగా పెంచిన ఆర్‌బీఐ.. EMIలు కట్టే వారికి షాక్!

RBI Hikes Repo Rate By 50 BPS: మీరు కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నేడు(సెప్టెంబర్ 30న) మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రెపో రేటును 0.50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.9 శాతానికి చేరుకుంది. అయితే, అసలు రెపో రేటు, ఈఎమ్ఐకి ఏంటి సంబందం అనుకుంటున్నారా?.

అయితే, దీని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొనిరావడానికి ఆర్‌బీఐ రెపో రేటును అప్పుడప్పుడు పెంచుతుంది. అలాంటి, సమయంలో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్‌బీఐ రెపో రేటుపు పెంచితే.. అప్పుడు బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది.

రేపో రేటు అంటే ఏమిటి?

ఇంకా సులభంగా చెప్పాలంటే రేపో రేటు అంటే, ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే వడ్డీ రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేపో రేటును ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది.

(ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ కొత్త రూల్‌.. ఇక వారికి చెక్!)

రేపో రేటున‌ను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. దీంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆర్‌బీఐ రేపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు.

- Advertisement -

రివర్స్ రేపో రేటు అంటే ఏమిటి?

బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు. ఇలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు. ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది.

మార్కెట్లో స్థిరత్వం లేన‌ప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్‌బీఐ వ‌ద్ద ఉంచి త‌క్కువైనా స‌రే స్థిర‌ వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆస‌క్తి చూపిస్తాయి. రివర్స్ రెపో రేటు శాతాన్ని గ‌తంలో రెపో రేటు వ‌డ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్ప‌ట్లో ఆర్‌బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది.

(ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ కొత్త రూల్‌.. ఇక వారికి చెక్!)

రెపో రేటు మారినప్పుడల్లా రివ‌ర్స్ రెపో రేటును దానికంటే 1 శాతం తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితికి వచ్చేసరికి ఆర్‌బీఐ రేపో రేటును పెంచడంతో బ్యాంకులు కూడా గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. అలాగే, ఇప్పటికే రుణాలు తీసుకున్న ఈఎమ్ఐ పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles